Sumaya Reddy : సుమయా రెడ్డి సెకండ్ సినిమా.. నిర్మాతగా, హీరోయిన్ గా..
ఈ సారి కూడా సుమయా రెడ్డి నిర్మాతగా సినిమాని తెరకెక్కిస్తూనే హీరోయిన్గా నటిస్తుంది. (Sumaya Reddy)
Sumaya Reddy
Sumaya Reddy : డియర్ ఉమ అనే సినిమాతో మొదటిసారి హీరోయిన్ గా మారడమే కాకుండా నిర్మాతగా, రచయితగా మెప్పించింది సుమయా రెడ్డి. ఇప్పుడు తన రెండో సినిమాతో రాబోతుంది. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై సుమయా రెడ్డి స్వీయ నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
Also Read : Ego Raja : ఈగో రాజా ఆది సాయి కుమార్ ‘రౌడీ రాకాసి పిల్ల..’ సాంగ్ విన్నారా?
ఈ సారి కూడా సుమయా రెడ్డి నిర్మాతగా సినిమాని తెరకెక్కిస్తూనే హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ రిలీజ్ చేసారు. ఈ పోస్టర్లో సుమయా రెడ్డి చేతి నిండా డబ్బు, బంగారంతో ఉండగా మహారాణి లుక్స్ లో కనిపిస్తుంది. కామెడీ, హారర్ జానర్లో సరికొత్త పాయింట్ తో ఈ సినిమా రాబోతుంది. త్వరలోనే ఈ ప్రొడక్షన్ నెం.2 టైటిల్ అనౌన్స్ చేసి మిగతా వివరాలను ప్రకటించనున్నారు.
View this post on Instagram
