ప్రభాస్ మెచ్చిన సినిమా.. అందర్నీ ఏడిపించిన ప్రేమకథ.. ఇప్పుడు ఓటీటీలోకి..
ప్రభాస్ కూడా ఈ సినిమాని ప్రమోట్ చేసాడు. (Couple Friendly)
Couple Friendly
- ప్రభాస్ మెచ్చిన సినిమా
- రీసెంట్ సూపర్ హిట్ కపుల్ ఫ్రెండ్లీ
- ఓటీటీలోకి వచ్చేస్తుంది
Couple Friendly : సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా తెరకెక్కిన సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ’. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రొమాంటిక్ ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళంలో రిలీజ్ అయింది.
ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా రొమాన్స్, కామెడీతో మెప్పించి సెకండ్ హాఫ్ లోఎమోషనల్ స్టోరీతో ప్రేక్షకులని కన్నీళ్లు పెట్టించింది ఈ సినిమా. కపుల్ ఫ్రెండ్లీ సినిమా మంచి విజయం సాధించింది. ఆల్మోస్ట్ 15 కోట్ల వరకు వసూలు చేసి విజయం సాధించింది ఈ సినిమా.
Also Read : Mark K Robin : నాని పరిచయం చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడు గద్దర్ అవార్డు వరకు..
ప్రభాస్ కూడా ఈ సినిమాని ప్రమోట్ చేసాడు. మూవీ యూనిట్ తో ప్రభాస్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ అప్పట్లో బాగా వైరల్ అయింది. ఈ సినిమా చూసి ప్రభాస్ చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను అని చెప్పాడు. తనకు వర్షం సినిమా ఎంతో సంతోష్ శోభన్ కి ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమా అంతే అని కూడా అన్నాడు.
కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మార్చ్ 13 నుంచి తెలుగు, తమిళ్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చూసేయండి.
Also Read : Alekhya Tarakratna : 23 రోజులు కొన ఊపిరితో నా కోసమే ఉన్నారు.. ఆయన చివరి హార్ట్ బీట్ కూడా విన్నా..

