US Iran War: ఇరాన్ తో యుద్ధం.. అమెరికా సంచలన ప్రకటన.. రష్యాకు కూడా వార్నింగ్
పశ్చిమాసియాలో రోజురోజుకు యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా పలు హెచ్చరికలు జారీ చేసింది.
Donald Trump Representative Image (Image Credit To Original Source)
US Iran War: ఇరాన్ తో యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. శత్రువులను పూర్తిగా నిర్మూలించే వరకు దాడులు కొనసాగిస్తామని అమెరికా రక్షణ శాఖ అధికారి పీట్ హెగ్సేత్ తెలిపారు. 10 రోజులుగా ఇరాన్ పై దాడులు చేస్తున్నామని, ఈ దాడులతో ఇరాన్ నాయకులకు భయం పట్టుకుందన్నారు. ఇప్పటికే ఇరాన్ లో అన్ని లక్ష్యాలను చేదించామంటున్న అమెరికా.. శత్రువులను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధం ఆగదన్నారు.
మరోవైపు యుద్ధంలో పాల్గొనవద్దని రష్యాను హెచ్చరించింది అమెరికా. అంతేకాదు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ.. అమెరికా అధ్యక్షుడి మాటలను పాటించాలని, అణ్వాయుధ కార్యక్రమం నుంచి వైదొలగాలని హెగ్సేత్ తేల్చి చెప్పారు. పశ్చిమాసియాలో రోజురోజుకు యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా పలు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఇరాన్ కు సహకరించొద్దని, ఈ యుద్ధంలో పాల్గొనవద్దని రష్యాకు కూడా సూచించింది అమెరికా.
