Ruturaj Gaikwad : చెన్నై కెప్టెన్ల‌లో రుతురాజ్ ఒక్క‌డే.. ధోనికి సాధ్యం కాలేదు.. ఆ రికార్డు ఏంటో తెలుసా?

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఎన్నో రికార్డులు బ‌ద్ద‌లు అవుతున్నాయి. మ‌రెన్నో కొత్త రికార్డులు న‌మోదు అవుతున్నాయి.

Ruturaj Gaikwad : చెన్నై కెప్టెన్ల‌లో రుతురాజ్ ఒక్క‌డే.. ధోనికి సాధ్యం కాలేదు.. ఆ రికార్డు ఏంటో తెలుసా?

PIC Credit @CSK

CSK captain Ruturaj Gaikwad : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో ఎన్నో రికార్డులు బ‌ద్ద‌లు అవుతున్నాయి. మ‌రెన్నో కొత్త రికార్డులు న‌మోదు అవుతున్నాయి. తాజాగా చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఓ స‌రికొత్త రికార్డును నెల‌కొల్పాడు. బుధ‌వారం చెపాక్ మైదానంలో చెన్నై సూప‌ర్ కింగ్స్‌, పంజాబ్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో అత‌డు ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ 48 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో 62 ప‌రుగులు చేశాడు.

ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్‌లో 500 ప‌రుగుల మైలురాయిని చేరుకున్న రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. 10 మ్యాచుల్లో 63 స‌గ‌టుతో 509 ప‌రుగులు సాధించాడు. కాగా.. ఐపీఎల్ చ‌రిత్ర‌లో సీఎస్‌కే త‌రుపున 500 ప‌రుగులు సాధించిన తొలి కెప్టెన్‌గా రుతురాజ్‌ చ‌రిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో ఎంఎస్ ధోని 461 ప‌రుగుల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.

CSK : చెన్నై సూప‌ర్ కింగ్స్ క‌ష్టాలు రెట్టింపు? ఒకేసారి ఐదుగురు స్టార్ బౌల‌ర్లు దూరం !

ఎంఎస్ ధోని చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు చాలా ఏళ్లుగా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. అత‌డు ఆఖ‌ర్లో బ్యాటింగ్ వ‌స్తాడు అన్న సంగ‌తి తెలిసిందే. కాగా.. ఈ సీజ‌న్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా రుతురాజ్ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు.

ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన సీఎస్‌కే కెప్టెన్లు వీరే..
రుతురాజ్ గైక్వాడ్ – 509* ప‌రుగులు (2024)
ఎంఎస్ ధోని – 461 ప‌రుగులు (2013)
ఎంఎస్ ధోని – 455 ప‌రుగులు (2018)
ఎంఎస్ ధోని – 419 ప‌రుగులు (2019)

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రుతురాజ్ గైక్వాడ్ (62) రాణించ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది. అనంత‌రం 17.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ ల‌క్ష్యాన్ని అందుకుంది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో జానీ బెయిర్ స్టో (46), రీలీ రూసొ(43) లు రాణించారు.

Hardik Pandya : అయ్యో పాపం.. హార్దిక్ పాండ్య‌కు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. మ‌రోసారి ఇలా చేస్తే మ్యాచ్ నిషేదం..

ఈ మ్యాచ్‌లో ఓడిపోయిన‌ప్ప‌టికీ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది. 10 మ్యాచుల్లో 5 మ్యాచుల్లో విజ‌యం సాధించిన సీఎస్‌కే ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి.