Rashmika Mandanna: కావాలనే నాపై ద్వేషం పెంచుతున్నారు.. ఇక సహించేది లేదు.. కఠిన చర్యలు తప్పవు
తన వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేస్తున్న వారికి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చిన రష్మిక మందన్నా(Rashmika Mandanna).
Rashmika Mandanna warns those spreading negative propaganda against her
- తనపై నెగిటీవ్ కామెంట్స్ చేస్తున్న వారిపై రష్మిక సీరియస్
- అల్టిమేటం జారీ చేసిన కన్నడ బ్యూటీ
- లీగల్ గా వెళ్తానంటూ వార్నింగ్
Rashmika Mandanna: సోషల్ మీడియాలో గత కొన్నేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులు, ట్రోలింగ్‌పై కన్నడ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎట్టకేలకు నోరువిప్పారు. ఎనిమిదేళ్లుగా భరిస్తూ వచ్చిన మౌనాన్ని వీడాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేస్తూ, తన వ్యక్తిగత జీవితంపై కామెంట్స్ చేస్తున్న వారికి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు.
ఇటీవల.. రష్మిక(Rashmika Mandanna) తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ లీక్ అవడం సంచలనంగా మారింది. ఆ ఆడియో ప్రకారం.. ‘రష్మిక, రక్షిత్ శెట్టిల మధ్య గొడవలకు ప్రధాన కారణం రష్మిక కెరీర్ అని తెలుస్తోంది. పెళ్లి తర్వాత రష్మిక నటనకు స్వస్తి చెప్పాలని రక్షిత్ కుటుంబం ఒత్తిడి తెచ్చిందని ఆ ఆడియో క్లిప్‌లో సుమన్ మందన్న ఆవేదన వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా, గీత గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండతో కిస్సింగ్ సీన్ చేయడం పట్ల కూడా రక్షిత్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆ సంభాషణలో ఉంది.
Monalisa: మాది లవ్ జిహాద్ కాదు.. అన్ని మతాలు సమానమే.. దర్శకుడికి మోనాలిసా సాలిడ్ కౌంటర్
ఈ వ్యవహారంపై రష్మిక మందన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ‘గత 24 గంటల్లో జరిగిన పరిణామాలు శృతి మించుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణను, నా అనుమతి లేకుండా రికార్డ్ చేసి దానిని ఇప్పుడు లీక్ చేయడం దురదృష్టకరం. కేవలం తమ స్వార్ధం కోసం, వ్యూస్ కోసం నాపై కావాలని ద్వేషాన్ని పెంచుతున్నారు’ అని ఆమె మండిపడ్డారు. తన కుటుంబ సభ్యులను సైతం ఈ వివాదంలోకి లాగడంపై ఆవేదన వ్యక్తం చేశారు రష్మిక. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉన్న ఆ కంటెంట్‌ను ప్రసారం చేస్తున్న మీడియా, సోషల్ మీడియా సంస్థలకు అల్టిమేటం జారీ చేశారు రష్మిక.
ప్రకటన చేసిన 24 గంటల్లోగా ఆ కంటెంట్‌ను తొలగించాలి. లేదంటే రేపటి నుండి చట్టపరమైన చర్యలు చేపట్టి, సంబంధిత వ్యక్తులకు లీగల్ నోటీసులు పంపుతామని హెచ్చరించారు. “ఇది నా జీవితం. ఎలా ఉండాలి అనేది నిర్ణయించాల్సింది మీరు కాదు. నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను’ అంటూ కన్నడ భాషలో కూడా గట్టిగానే సమాధానం ఇచ్చారు రష్మిక. ప్రస్తుతం రష్మిక చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026
