Ashwini Dutt : చిరంజీవే నాకు టీడీపీ ఎంపీ సీట్ ఇప్పించారు.. నేను కమ్యూనిస్ట్ ని కానీ..

రాజకీయాలపై అశ్విని దత్ మాట్లాడుతూ.. ''ఎన్టీఆర్‌ గారు పార్టీ పెట్టినప్పుడు నేను కృష్ణగారితో ‘అగ్నిపర్వతం’ సినిమా చేస్తున్నాను. కృష్ణగారేమో అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. నేను అప్పటికే ఇంకా కొన్ని సినిమాలు ఒప్పుకొని ఉన్నా. ఆ సమయంలో రాజకీయాల్లోకి........

Ashwini Dutt :  టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘సీతారామం’ సినిమా మంచి విజయం సాధించి, కలెక్షన్లు బాగా తీసుకొస్తుంది. ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మించారు. తాజాగా ఆయన ‘ఆలీతో సరదాగా’ టాక్ షోలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలని తెలియచేశారు. అశ్విని దత్ 2004 ఎలక్షన్స్ లో విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ టాక్ షోలో సినిమాల గురించే కాక రాజకీయాల గురించి కూడా మాట్లాడారు.

రాజకీయాలపై అశ్విని దత్ మాట్లాడుతూ.. ”ఎన్టీఆర్‌ గారు పార్టీ పెట్టినప్పుడు నేను కృష్ణగారితో ‘అగ్నిపర్వతం’ సినిమా చేస్తున్నాను. కృష్ణగారేమో అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. నేను అప్పటికే ఇంకా కొన్ని సినిమాలు ఒప్పుకొని ఉన్నా. ఆ సమయంలో రాజకీయాల్లోకి వస్తే సినిమాల పరంగా సమస్య వస్తుందని రాజకీయాల్లోకి వెళ్ళలేదు. మా నాన్న కమ్యూనిస్ట్‌. నాకు కూడా మొదటి నుంచి ఆ భావాలే ఉన్నాయి. కానీ రామారావుగారి మీద అభిమానంతో ఆయన పార్టీ గెలవాలని కోరుకునేవాడ్ని. ఆయన మీద అభిమానంతో ఆ పార్టీ సభ్యుడిగా చేరాను. అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు.”

Vijay – Ananya : థ్యాంక్యూ ఆంటీ.. విజయ్ ఇంట్లో స్పెషల్ పూజలు చేసిన అనన్య పాండే.. విజయ్ తల్లికి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్..

”చంద్రబాబు నాయుడు గొప్ప విజన్ ఉన్న నాయకుడు. ఆయనపై గౌరవంతో, చిరంజీవి గారి ప్రోద్బలంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. చిరంజీవే స్వయంగా చంద్రబాబు గారితో మాట్లాడి విజయవాడ ఎంపీ సీటు ఇప్పించారు. కాకపోతే ఆ ఎలక్షన్స్ లో ఓడిపోయాను. ఇక ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగడం లేదు. కానీ చంద్రబాబు గారి మీద ఉన్న గౌరవంతో ఆయన కోసం నేను, స్వప్న ఆ పార్టీ ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నాం. తరచూ ఆయన్ను కలుస్తూనే ఉంటాను. నాకు ఎన్నికల్లో పోటీ చేయాలని, పదవులు చేపట్టాలని అస్సలు లేదు” అని అన్నారు. చిరంజీవే అశ్వినీదత్ కి టీడీపీ ఎంపీ సీట్ ఇప్పించారు అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ట్రెండింగ్ వార్తలు