Suhas Prasanna Vadanam Trailer Released
Prasanna Vadanam Trailer : సుహాస్(Suhas) వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో మంచి విజయం సాధించిన సుహాస్ త్వరలో ‘ప్రసన్న వదనం’ అనే సినిమాతో రాబోతున్నాడు. లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ, ప్రసాద్ రెడ్డి నిర్మాణంలో కొత్త దర్శకుడు అర్జున్ దర్శకత్వంలో సుహాస్ హీరోగా, పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా.. వైవా హర్ష, నితిన్ ప్రసన్న, సాయి శ్వేతా.. పలువురు ముఖ్య పాత్రల్లో ప్రసన్న వదనం సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Yash : వైరల్ అవుతున్న KGF యశ్ కొత్త లుక్ చూశారా? గడ్డం తగ్గించి.. ‘టాక్సిక్’ సినిమా కోసమేనా..?
ఆల్రెడీ ప్రసన్న వదనం సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేసి మంచి ఆసక్తి నెలకొల్పారు. ఫేస్ బ్లైండ్ నెస్ అనే జబ్బు కాన్సెప్ట్ తో సుహాస్ మరో కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఇక ట్రైలర్ చుటిస్తుంటే.. సుహాస్ తనకున్న ఫేస్ బ్లైండ్ నెస్ జబ్బుతో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఓ మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడు అనే కథాంశంతో ఈ ప్రసన్న వదనం సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ప్రసన్న వదనం సినిమా మే 3న రిలీజ్ కాబోతుంది. మీరు కూడా ట్రైలర్ చూసేయండి..