Varalaxmi Sarathkumar : అలాంటి మగవాళ్ళకి కట్ చేసేయాలి.. వరలక్ష్మి సంచలన వ్యాఖ్యలు..
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. (Varalaxmi Sarathkumar)
Varalaxmi Sarathkumar
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ్ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల దర్శకురాలిగా మారి మెయిన్ లీడ్ లో నటిస్తూ సరస్వతి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్నపిల్లలపై అత్యాచారాల కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది.
Also Read : Gautam Ghattamaneni : మహేష్ తనయుడి కొత్త షార్ట్ ఫిలిం చూశారా? గౌతమ్ ఎలా నటించాడో చూడండి..
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. చిన్న పిల్లలను హెరాజ్ చేసే వాళ్ళను, రేప్ చేసే వాళ్ళను వదిలిపెట్టకూడదు. వాళ్లకు చావు అనేది చిన్నది. సింపుల్ గా చంపేయకూడదు. అలాంటి వాళ్లకు కట్ చేసేయాలి. నేను సీఎం అయితే రేప్ లాంటివి చేస్తే అబ్బాయిలకు కట్ చేసేయాలి అనే చట్టం తీసుకొస్తా. ఆ భయం రావాలి అబ్బాయిలకు. పిల్లలకు కూడా మనం నమ్మకం ఇవ్వాలి. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలి అని కామెంట్స్ చేసింది.
