Subhashree Rayaguru : పవన్ OG సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్.. బయటకి రాగానే షూట్ లో బిజీ..

శుభశ్రీకి బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే ఏకంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలో ఛాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న They call him OG సినిమాలో శుభశ్రీకి ఛాన్స్ వచ్చింది.

Subhashree Rayaguru gets a chance in Pawan Kalyan OG Movie after Bigg Boss

Subhashree Rayaguru : పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పలు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకుంది శుభశ్రీ రాయగురు. ఇటీవల బిగ్‌బాస్(Bigg Boss) హౌస్ లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది శుభశ్రీ. హౌస్ లో తన ఆటతో పర్వాలేదనిపించినా ఐదో వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది శుభశ్రీ. ఇక బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి మొదట్లో మంచి గుర్తింపు ఉంటుంది. దాన్ని సరిగ్గా వాడుకుంటే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు సాధించొచ్చు.

ఇప్పుడు శుభశ్రీకి కూడా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే ఏకంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమాలో ఛాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న They call him OG సినిమాలో శుభశ్రీకి ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో శుభశ్రీ ఓ పాత్ర చేయబోతుంది. ఈ విషయాన్ని శుభశ్రీ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. OG సినిమా షూటింగ్ లొకేషన్ లో డైరెక్టర్ సుజీత్, కెమెరామెన్ రవిచంద్రన్ తో ఫోటోలు దిగి వాటిని పోస్ట్ చేసింది.

Also Read : Anil Ravipudi : భగవంత్ కేసరి సీక్వెల్ పై స్పందించిన అనిల్ రావిపూడి.. ఏమన్నాడంటే?

శుభశ్రీ ఈ ఫోటోలు షేర్ చేసి.. నా ఫేవరేట్ హీరో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో, ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుజీత్ గారికి, DVV ఎంటర్టైన్మెంట్స్ కి ధన్యవాదాలు. నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్లందరికీ చాలా థ్యాంక్స్ అని తెలిపింది. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవ్వగా.. బిగ్ బాస్ నుంచి బయటకి రాగానే ఏకంగా పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేశావుగా అని కంగ్రాట్స్ చెప్తూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు