Swathi Reddy : విడాకుల వార్తలు పై నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి.. సీరియస్ అయిన స్వాతి..

స్వాతిరెడ్డిని విడాకుల వార్తలు పై ఒక క్లారిటీ ఇవ్వాలని అడగగా.. నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి అంటూ నవ్వుతూనే సీరియస్ సమాధానం ఇచ్చింది.

Swathi Reddy reaction on Divorce rumours at Month of Madhu event

Swathi Reddy : టాలీవుడ్ హీరోయిన్ స్వాతి రెడ్డి.. 2018లో పెళ్లి తరువాత సినిమాల్లో కనిపించలేదు. ఇక ఇటీవల మళ్ళీ తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తుంది. ప్రస్తుతం ఈ భామ నటించిన ‘మంత్ అఫ్ మధు’ (Month of Madhu) మూవీ రిలీజ్ కి సిద్ధమైంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న స్వాతి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈక్రమంలోనే విలేకర్లు ఆమె విడాకుల వార్తలు గురించి ప్రశ్నించారు. ఈ విషయం పై స్వాతి.. నవ్వుతూనే సీరియస్ సమాధానం ఇచ్చింది.

Akhil Akkineni : అఖిల్ కోసం వస్తున్న రాజమౌళి.. అయ్యగారు ఈ సారైనా హిట్ కొడతారా?

ఇటీవల స్వాతి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన మ్యారేజ్ ఫోటోలను తొలిగించింది. అయితే వాటిని స్వాతి డెలీట్ చేసిందా..? లేదా హైడ్ లో పెట్టిందా..? అనేది తెలియదు. కాగా ఇటీవల విడాకులు తీసుకున్న సెలబ్రిటీస్ అంతా విడిపోవడానికి ముందు ఇలా ఫోటోలను డెలీట్ చేయడం జరుగుతుంది. దీంతో స్వాతి కూడా అదే బాటలో విడాకులు తీసుకోబోతుందా..? అని వార్తలు రావడం మొదలయ్యాయి. ఇక ఈ వార్తలు పై ఒక క్లారిటీ ఇవ్వాలంటూ విలేకర్లు స్వాతిని కోరారు.

Mangalavaaram : శుక్రవారం రానున్న ‘మంగళవారం’.. RX 100 డైరెక్టర్ నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

స్వాతి బదులిస్తూ.. “నేను ఇవ్వను. నేను చెప్పను. నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి” అంటూ బదులిచ్చింది. దీంతో విడాకులు వార్తలపై ఒక క్లారిటీ రాకుండానే పోయింది. అయితే కొందరు నెటిజెన్స్ స్వాతి సమాధానంలోనే క్లారిటీ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్వాతి ‘నేను ఇవ్వను’ అని బదులిస్తూ.. ఇటు విడాకుల రూమర్స్, అటు భర్తకి విడాకులు ఇచ్చేదేలే అని చెప్పుకొచ్చింది అంటున్నారు.

కాగా స్వాతి గతంలో కూడా కొన్ని పర్సనల్ ఫోటోలను ఇలానే హైడ్ చేసింది. అప్పుడు స్వాతి చెప్పిన సమాధానం.. “తన వ్యక్తిగత జీవితం అందరికి అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదు”. ఈక్రమంలోనే స్వాతి ఇప్పుడు కూడా తన పర్సనల్ ఫోటోలను హైడ్ (ఆర్కైవ్) చేసి ఉండవచ్చని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు