Hero Darshan : హీరో కోసం జైలుకి వెళ్లిన డైరెక్టర్.. ఎందుకో తెలుసా?

తాజాగా నటుడు, దర్శకుడు తరుణ్ సుధీర్ జైల్లో దర్శన్ ని కలిసాడు.

Director Tarun Sudhir Meets Hero Darshan in Jail

Hero Darshan : కన్నడ హీరో దర్శన్ ఇటీవల ఓ అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసు విచారణ సాగుతుండగా దర్శన్ తో పాటు అరెస్ట్ అయిన పలువురు జైల్లోనే ఉన్నారు. ఈ హత్య కేసులో ఆధారాలు అన్ని దర్శన్ కి వ్యతిరేకంగానే ఉన్నాయి. అయితే పలువురు దర్శన్ అభిమానులు మాత్రం దర్శన్ కి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు.

తాజాగా నటుడు, దర్శకుడు తరుణ్ సుధీర్ జైల్లో దర్శన్ ని కలిసాడు. తరుణ్ సుధీర్ దర్శకత్వంలో గతంలో దర్శన్ నటించాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే ఆగస్టులో తరుణ్ పెళ్లి ఉండటంతో దర్శన్ ని పెళ్ళికి పిలవడానికి జైలుకి వెళ్ళాడు. జైల్లో దర్శన్ ని కలిసి తరుణ్ తన పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించాడు. త్వరలోనే నిరపరాధిగా బయటకు వస్తావని ఓదార్చాడు.

Also Read : Pranayagodari Glimpse : ప్రణయగోదారి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. రొమాంటిక్‌తో పాటు మాస్ కూడా..

జైల్లో దర్శన్ ని కలిసిన అనంతరం తరుణ్ సుధీర్ మీడియాతో మాట్లాడుతూ.. దర్శన్ ఎప్పట్లాగే నవ్వుతూ పలకరించాడు. అయితే ఆయన్ని చూస్తుంటే ఆరోగ్యం బాగోలేదు అనిపిస్తుంది. అయన అరెస్ట్ తర్వాత మేమంతా ఏదో కోల్పోయాము అనిపిస్తుంది. దర్శన్ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు. నా పెళ్లి కుదిరిన సంగతి గతంలోనే దర్శన్ కి తెలుసు. నా పెళ్ళికి ఆహ్వానించడానికి జైలుకి వచ్చి దర్శన్ ని కలిసాను. తన కోసం పెళ్లి వాయిదా వేసుకోకు అని తిట్టారు. ఆయన త్వరలో నిరపరాధిగా బయటకు వస్తారు. నా పెళ్ళికి హాజరవుతారు అని అన్నాడు. దీంతో దర్శకుడు తన పెళ్ళికి పిలవడానికి జైలుకి వెళ్లి మరీ దర్శన్ ని కలవడంతో కన్నడ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు