Kalki 2898AD : కల్కి నిర్మాతలకు షాక్.. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ లీగల్ నోటీసులు..

తాజాగా ఓ స్వామిజి కల్కి నిర్మాతలకు, నటులకు నోటీసులు పంపడం చర్చగా మారింది.

Acharya Pramod Krishnam Sends Legal Notice to Kalki 2898AD Producers and Actors news Goes Viral

Kalki 2898AD : నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898AD సినిమా గత నెల జూన్ 27న రిలీజయి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్.. పలువురు ముఖ్య పాత్రలతో తెరకెక్కిన కల్కి సినిమా ఇప్పటికే 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి దూసుకుపోతుంది. కల్కి సినిమా ఇంకా థియేటర్స్ లో ఆడుతుంది.

అయితే కల్కి సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ఈ సినిమాని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా వల్ల మన చరిత్ర, మహాభారతాలు పిల్లలు ఆసక్తిగా తెలుసుకుంటున్నారు, రాబోయే తరాలకు ఇలాంటి సినిమాలు అవసరం అంటూ అభినందించారు. అయితే తాజాగా ఓ స్వామిజి కల్కి నిర్మాతలకు, నటులకు నోటీసులు పంపడం చర్చగా మారింది.

Also Read : Tollywood Cute Baby : ఈ క్యూట్ బాబు ఎవరో తెలుసా..? టాలీవుడ్ స్టార్ కపుల్ తనయుడు..

హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపిస్తూ అమితాబ్ బచ్చన్‌, ప్రభాస్ తో సహా కల్కి 2898 AD నిర్మాతలు, నటులకు ఆచార్య ప్రమోద్ కృష్ణం లీగల్ నోటీసులు పంపారు. ఈ క్రమంలో ఆచార్య ప్రమోద్ కృష్ణం మాట్లాడుతూ.. సనాతన గ్రంథాలను మార్చకూడదు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం సినిమావాళ్లకు కాలక్షేపంగా మారింది. ఇక సహించేది లేదు. కల్కి నారాయణ భగవానుడి అవతారం. కల్కి గురించి పురాణాల్లో, గ్రంధాల్లో స్పష్టంగా ఉంది. అది కాకుండా వీళ్లకు ఇష్టం వచ్చినట్టు మార్చి తీశారు అని అన్నారు. అలాగే ఆచార్య ప్రమోద్ లాయర్ కూడా మాట్లాడుతూ.. హిందూ పురాణాలను ఇష్టమొచ్చినట్టు మార్చి సినిమా తీసినందుకు నటీనటులకు, నిర్మాతలకు నోటీసులు పంపించాము అని తెలిపారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

అయితే ఈ సినిమాతో మహాభారతం, కల్కి గురించి గొప్పగా చెప్తే ఇలా మనోభావాలు దెబ్బ తీసారని నోటీసులు పంపించడంతో అభిమానులు, సినిమా నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. సినిమా ముందు డిస్క్లైమర్ చదవలేదా అని కామెంట్స్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు