Actress : ఈ హీరోయిన్స్ పెళ్లి చేసుకోరా? ఏజ్ పెరుగుతున్నా ఆ ఊసే ఎత్తని భామలు..
సోలో బ్రతుకే సో బెటరూ అని డిసైడ్ అవుతున్నారు కొంతమంది హీరోయిన్లు.
Actresses
- సినిమాలతో బిజీ అంటున్న హీరోయిన్స్
- ఏజ్ పెరుగుతున్నా పెళ్ళికి నో అంటున్న హీరోయిన్స్
- ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఫ్యాన్స్ వెయిటింగ్
Actress : గ్లామర్ వరల్డ్ లో సింగిల్ గా ఉండడం అంత ఈజీ కాదు. సరే మింగిల్ అవుదామని డేటింగ్, రిలేషన్ షిప్ కంటిన్యూ చేసినా అది పెళ్లి వరకూ దారి తీస్తుందని చెప్పలేం. అందుకే ఎందుకొచ్చిన తలనొప్పని సోలో బ్రతుకే సో బెటరూ అని డిసైడ్ అవుతున్నారు కొంతమంది హీరోయిన్లు.
తెలుగులో స్టార్ హీరోయిన్ అనుష్క అసలు పెళ్లి ఊసే ఎత్తనంటోంది. ప్రభాస్ తో రిలేషన్ రూమర్స్ ఎన్నొచ్చినా, జస్ట్ ఫ్రెండ్సే అని చెప్పిన అనుష్క అసలు తన లవ్ లైఫ్ గురించి ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదు. అసలు ప్రేమలో ఉందా? పెళ్లి చేసుకుంటుందా అన్న హింట్ కూడా ఇవ్వడం లేదు 43ఏళ్ల అనుష్క.
42ఏళ్ల వయసులో కూడా మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా ఉన్న త్రిష కూడా ఈ లవ్, రిలేషన్లు మనవల్ల కాదంటోంది. 10 ఏళ్ల క్రితం బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అయ్యి ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకుంది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి రిలేషన్ షిప్ అనౌన్స్ చెయ్యకుండా సింగిల్ గా ఉంటోంది త్రిష. దాంతో వరసగా ఇంట్రస్టింగ్ మూవీస్ చేస్తూ..కెరీర్ ని పరుగులుపెట్టిస్తోంది.
Also See : Allu Sirish : అల్లు శిరీష్ మంగళ స్నానం, పెళ్లి కొడుకు వేడుక.. ఫొటోలు వైరల్..
40 ఏళ్ల శృతి హాసన్ కూడా అంతే సింగిల్ గానే హ్యాపీగా ఉన్నానంటోంది. అంతేకాదు ఒకప్పుడు పెళ్లి చేసుకుందామనుకున్న శృతికి ఇప్పుడు పెళ్లంటే భయమేస్తోందట. మైఖెల్ కోర్సెల్, శంతను హజారికాతో ప్రేమ, బ్రేకప్ తర్వాత ఇప్పుడు సింగిల్ స్టేటసే బెస్ట్ అనిపిస్తోందట శృతి హాసన్ కి. అందుకే వరసపెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న శృతి ఫ్యూచర్ లో ఏమైనా జరగొచ్చు అంటోంది.
37 ఏళ్ల నిత్యామీనన్ ఫస్ట్ నుంచి బోల్డ్ స్టేట్ మెంట్స్ తో తన ఒపీనియన్స్ చెబుతూ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. జస్ట్ గ్లామర్ రోల్స్ కాకుండా పర్ఫామెన్స్, ఇంపాక్ట్ ఫుల్ రోల్స్ చేసే నిత్యామీనన్ కూడా ఇప్పటి వరకూ రిలేషన్ షిప్, పెళ్లి అన్న మాటే ఎత్తలేదు. గతంలో కూడా నిత్యా మీద ఎన్ని రూమర్స్ వచ్చినా అవన్నీ అబద్దమే అని కొట్టిపారేసింది. అంతేకాదు నా పెళ్లి, నా ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన అతన్ని చేసుకుంటానని తెగేసి చెప్పింది.
35 ఏళ్ల రాశి ఖన్నా కూడా ఇండస్ట్రీలో దాదాపు 15 ఏళ్ల నుంచి కెరీర్ కంటిన్యూ చేస్తోంది. పెళ్లి వయసు కూడా వచ్చేసింది. కానీ ప్రేమ, పెళ్లి అన్న మాట ఎత్తడం లేదు. హీరోల దగ్గరనుంచి క్రికెటర్ల వరకూ చాలా మందితో డేటింగ్ చేసిందని రూమర్స్ వచ్చినా ఎప్పుడూ వాటిపై రియాక్ట్ అవ్వలేదు రాశిఖన్నా. ప్రస్తుతం తెలుగు, హిందీలో సినిమాలు చేస్తున్న రాశి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ స్టార్ట్ చేద్దామన్న ఆలోచన ఇప్పట్లో లేదంటోంది.
కొంతకాలం ప్రేమలో ఉండి ఆ తర్వాత అది వర్కవుట్ కాక, పెళ్లి వరకూ రాకపోవడంతో పెళ్లి గురించి అసలు ఆలోచనే చెయ్యడం లేదు కొంతమంది హీరోయిన్లు.
లాస్ట్ ఇయర్ వరకూ విజయ్ వర్మ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తమన్నా ఇప్పుడు సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తోంది. విజయ్ వర్మతో రెండేళ్లనుంచి ఉన్న తన లవ్లీ రిలేషన్ ని ఫ్రెండ్లీ రిలేషన్ గా షిఫ్ట్ చేసేసి ప్రస్తుతానికి సింగిల్ స్టేటస్ మెయింటెన్ చేస్తోంది తమన్నా. ఇప్పుడప్పుడే ప్రేమ, పెళ్లి గురించి ఆలోచించనని కూడా చెబుతోంది 36 ఏళ్ల తమన్నా.
35 ఏళ్ల పూజాహెగ్డే కూడా ఇప్పటి వరకూ తన లవ్, రిలేషన్ షిప్ స్టేటస్ మీద ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు. అసలు ఎవర్నైనా ప్రేమిస్తోందా? డేటింగ్ లో ఉందా? లేకపోతే పెళ్లి చేసుకునే ఆలోచనలోనే లేదా? అనే విషయాలపై పెద్దగా ఎప్పుడూ రివీల్ చెయ్యలేదు పూజా. ఆల్రెడీ తన తమ్ముడు పెళ్లి మాత్రం చేసేసింది. అయితే కెరీర్ కొంచెం డౌన్ ఫాల్ లో ఉండటంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతుందని ఫిక్స్ అయ్యారు జనాలు. కానీ అందరి నోళ్లూ మూయిస్తూ మళ్ళీ సౌత్, నార్త్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవ్వడానికి రెడీ అవుతోంది పూజాహెగ్డే.
33 ఏళ్ల సాయిపల్లవి కూడా అంతే. ఒకవైపు డాక్టర్ గా, మరో వైపు యాక్టర్ గా ఫుల్ బిజీగా ఉంది సాయిపల్లవి. అందుకే పెళ్లివైపు ఆలోచన కూడా లేదని తెలుస్తోంది. ఆ మధ్య సాయిపల్లవి పెళ్లి చేస్కోబోతోందంటూ రూమర్స్ వచ్చినా అవన్నీనిజంకాదని తేల్చేసింది. లాస్ట్ ఇయర్ చెల్లి పెళ్లి చేసిన సాయిపల్లవి పెళ్లి చేస్కోబోయేది ఎప్పుడో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫాన్స్ .
Also Read : Raakaasa : ‘రాకాస’ టీజర్ వచ్చేసింది.. హారర్ కామెడీ..
మృణాల్ ఠాకూర్ కూడా అంతే. పెళ్లి చేస్కునే ఆలోచన ఉన్నా ఇప్పుడు అంత ఖాళీగా లేనంటోంది 33ఏళ్ల మృణాల్. కెరీర్ లో సాధించాల్సింది చాలా ఉందని చెబుతోంది. అంతేకాదు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి రివీల్ చేసింది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చాలా ఇన్ సెక్యూర్ గా ఉండే వాడని, ఇద్దరికీ సెట్ అవ్వలేదని దాంతో బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలిపింది. ధనుష్ ని పెళ్లి చేసుకుంటుంది మృణాల్ అని వార్తలు వచ్చినా అవన్నీ అబద్దం అని కొట్టేసింది.
ఇక ఇండస్ట్రీలో దాదాపు 10 ఏళ్లనుంచి ఉన్న 30 ఏళ్ల అనుపమ పరమేశ్వరన్, నివేతాధామస్ ఇద్దరూ కూడా పెళ్లి, డేటింగ్ విషయంలో సైలెంట్ గానే ఉన్నారు. అయితే అనుపమ మాత్రం స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ తో డేటింగ్ లో ఉందని సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకూ తెలీదు.
