Swami Prasad Maurya: హిందూ మతమనేదే లేదు, బ్రాహ్మణిజాన్ని అలా పిలుస్తున్నారు.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వామి ప్రసాద్ మౌర్య

హిందూ మతం కోసం మనం పిచ్చితో చనిపోవచ్చు. కానీ బ్రాహ్మణ వ్యవస్థలోని తెలివైన వ్యక్తులు మనల్ని గిరిజనులుగా పరిగణిస్తున్నారు. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విషయంలోనూ అదే జరిగింది. దళితుడు కావడంతో ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు

Swami Prasad Maurya

Hinduism A Hoax: సమాజ్‭వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన చేసిన మరో ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హిందూ మతం అనే మతం లేదని, హిందూమతం కేవలం బూటకమంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణిజం మూలాలు చాలా లోతుగా ఉన్నాయని, బ్రాహ్మణిజాన్నే హిందూమతంగా పిలుస్తున్నారని అన్నారు. హిందూ మతం నిజానికి వెనుకబడిన, గిరిజనులు, దళితులను ఉచ్చులో ఉంచే కుట్రని అన్నారు. హిందూ మతంగా ఉంటే దళితులకు, వెనుకబడిన వారికి గౌరవం ఉండేదని మౌర్య అన్నారు.

Revanth Reddy : దళితుడిని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది కాదు.. మా డిక్లరేషన్ : రేవంత్ రెడ్డి

ఆయన మాట్లాడుతూ ‘‘మన దేశంలో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నాం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైంది. గిరిజన సామాజికవర్గం నుంచి వచ్చిన వ్యక్తి దేశ ప్రథమ పౌరురాలిగా (రాష్ట్రపతి) ఉన్నారు. మరి ద్రౌపది ముర్మును గుడిలోకి వెళ్లడానికి అడ్డుకుంటున్నారు. రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ ఆమెకు ఉన్న బలమేంటి? రాష్ట్రపతి సమక్షంలోనే కింది స్థాయి మంత్రి గుడిలోకి వెళ్తారు. కారణం ఆయన ఉన్నత కులానికి చెందినవాడు కాబట్టి. ఒకవేళ ఆమె నిజంగా హిందువుగా ఉండి ఉంటే, ఆమెకు ఇలా జరిగేది కాదు’’ అని ఆయన అన్నారు.

Lakshmi Parvati : ఎన్టీఆర్ భార్యగా నన్ను పిలవకపోవడం అన్యాయం.. ఢిల్లీ వెళ్తా.. ప్రధాని, రాష్ట్రపతి, నిర్మలా సీతారామన్‌లను కలుస్తా

‘‘హిందూ మతం కోసం మనం పిచ్చితో చనిపోవచ్చు. కానీ బ్రాహ్మణ వ్యవస్థలోని తెలివైన వ్యక్తులు మనల్ని గిరిజనులుగా పరిగణిస్తున్నారు. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ విషయంలోనూ అదే జరిగింది. దళితుడు కావడంతో ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా, అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా ఒకటి జరిగింది. ఆయన వెనుకబడిన సమాజం నుంచి వచ్చిన వ్యక్తి. అందుకే ఆయన పదవి నుంచి దిగిపోగానే ముఖ్యమంత్రి నివాసం, కాళిదాస్ మార్గ్‌ను గోమూత్రంతో పవిత్రం కడిగారు. బాబాసాహేబ్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే వంటి మన మహానుభావులు సుదీర్ఘ పోరాటం చేశారు. దాని ఫలితంగానే వేల ఏళ్ల బానిసత్వం నుంచి విముక్తి పొంది నేడు మనం గౌరవం, ఆత్మగౌరవం బాటలో పయనిస్తున్నాం’’ అని స్వామి ప్రసాద్ మౌర్య అన్నారు.

ట్రెండింగ్ వార్తలు