ఇంత దారుణమా.. మహిళను జుట్టు పట్టుకొని కొట్టిన కారు ఓనర్.. మహిళ వీడియో వైరల్..
27ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై బనెర్ - పాషన్ రోడ్డుపై వెళ్తుంది. స్వప్నిల్ కెక్రే అనే వ్యక్తి .,.
- Harishth Thanniru
- Published On : July 21, 2024 / 11:25 AM IST
Pune Road Rage
Pune Road Rage : మహిళ పట్ల ఓ కారు ఓనర్ దారుణంగా వ్యవహరించాడు. ఆమె జట్టు పట్టుకొని విచక్షణారహితంగా కొట్టాడు. పక్కనే మహిళకు చెందిన ఇద్దరు పిల్లలు ఉన్నారనికూడా ఆలోచించకుండా దారుణంగా ప్రవర్తించాడు. కారు ఓనర్ చేసిన దాడికి మహిళ ముక్కు పగిలి తీవ్ర రక్తస్రావం అయింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వీడియో ద్వారా వివరించి.. ఆ వీడియోను మహిళ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అయితే, సదరు కారు ఓనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర లోని పుణె లోజరిగింది. దాడి చేసే క్రమంలో కారు ఓనర్ సతీమణి కారులోనే ఉండటం విశేషం. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : భార్యకోసం రోజుకు 320 కి.మీ ప్రయాణిస్తున్న భర్త.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
27ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై బనెర్ – పాషన్ రోడ్డుపై వెళ్తుంది. స్వప్నిల్ కెక్రే అనే వ్యక్తి ఆమె వెనుకాలే కారులో వెళ్తున్నారు. కారులో అతని సతీమణి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొద్దిదూరం స్కూటీ వాహనం వెనుకాలే వచ్చిన వ్యక్తి.. ఒక్కసారిగా స్కూటీని ఓవర్ టేక్ చేసి కారును తీసుకెళ్లి ఆపాడు. కారులో నుంచి దిగిన స్వప్నిల్ కెక్రే వేగంగా స్కూటీపై ఉన్న మహిళ వైపుకు దూసుకొచ్చాడు. ఆమె ముఖంపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. దీంతో ఏం జరుగుతుందో సదరు మహిళకు అర్ధంకాలేదు. పక్కనే ఉన్న ఇద్దరు పిల్లలు ఏడుస్తున్నా వ్యక్తి పట్టించుకోలేదు.
Also Read : Real Estate Boom : హైదరాబాద్‌లో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
కారు ఓనర్ దాడితో మహిళ ముక్కు పగిలిపోయింది. తీవ్ర రక్తస్రావం అయింది. తనకు జరిగిన అవమానకరమైన ఘటనను వీడియో తీసిన మహిళ.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో అది వైరల్ అవుతుంది. అయితే, కారులో అతనితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధిత మహిళ నుంచి వివరాలు సేకరించారు. అయితే, కారులో అతనితోపాటు అతని భార్యకూడా ఉన్నట్లు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
