భార్యకోసం రోజుకు 320 కి.మీ ప్రయాణిస్తున్న భర్త.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

లిన్ అతని భార్యను ఏడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇటీవలే వారు వివాహం చేసుకున్నారు. అయితే, వారి ప్లాట్ వైఫాంగ్ లో ఉంది. అది ఆమె స్వస్థలం కావడంతో ..

భార్యకోసం రోజుకు 320 కి.మీ ప్రయాణిస్తున్న భర్త.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Newly Married Man Travels 320 Km for Day

Updated On : July 21, 2024 / 8:53 AM IST

Man Travels 320 Km Day : భార్య అంటే భర్తలో సగభాగం. భార్యకోసం ఏదైనాచేసే భర్తలు అనేక మందిని చూస్తుంటాం. ముఖ్యంగా కొత్తగా పెళ్లిచేసుకున్న మగవారు వారి భార్యల మెప్పుకోసం అనేక విధాల ప్రయత్నాలు చేస్తుంటారు. మరోవైపు తనను నమ్మి తనతో ఏడు అడుగులు నడిచిన భార్యను భద్రంగా చూసుకోవటం కూడా భర్త బాధ్యత. ఈ క్రమంలోనే ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్యను భద్రంగా చూసుకునేందుకు చైనాలోని ఓ భర్త రోజుకు 320 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాడు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. భార్యపై అతడికున్న ప్రేమచూసి ప్రజలు ఫిదా అవుతున్నారు. చైనాలో ఈ ఉదంతం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Also Read : Sitara Ghattamaneni : బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ చేసుకున్న సితార‌.. న‌మ్ర‌తా పోస్ట్ చూశారా..?

చైనాకు చెందిన మిస్టర్ లిన్ షూ, అతడి భార్య షాండాండ్ ప్రావిన్స్ లోని వీఫాంగ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. మిస్టర్ లిన్ కు 31ఏళ్లు. అతను పనిచేసే కార్యాలయం తన నివాస ప్రాంతానికి 160కిలోమీటర్ల దూరంలో కింగ్డావోలో ఉంది. అయితే, లిన్ రోజూ ఉదయం 5గంటలకు నిద్రలేచి 6.15గంటలకు రైల్వే స్టేషన్ కు వెళ్తాడు. 7.46 గంటలకు కింగ్డావోకు చేరుకొని అక్కడి నుంచి 15 నిమిషాలపాటు భూగర్భ సబ్ వేలో ప్రయాణించి అతడు పనిచేసే కార్యాలయంకు వెళ్తాడు. ఆఫీస్ కు వచ్చిపోవడానికి రోజంతా దాదాపు 320 కిలోమీటర్లు లిన్ ప్రయాణిస్తున్నాడు. ఇంతదూరం ప్రయాణం చేయడం ఎందుకు.. తాను పనిచేసే కార్యాలయంకు దగ్గరలోనే నివాసం ఏర్పాటు చేసుకోవచ్చుగా అనే డౌట్ మీకు రావొచ్చు. కానీ, తన భార్యపై లిన్ కు ఉన్న ప్రేమ కారణంగా అతను రోజూ సుదీర్ఘదూరం ప్రయాణిస్తున్నాడు.

Also Read : Harbhajan Singh : ఏంట‌దీ.. పాక్ జ‌ర్న‌లిస్ట్ పై హ‌ర్భ‌జ‌న్ ఆగ్ర‌హం.. ఈ రోజుల్లో కూడానా..

లిన్ అతని భార్యను ఏడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఇటీవలే వారు వివాహం చేసుకున్నారు. అయితే, వారు నివాసముండే ప్లాట్ వైఫాంగ్ లో ఉంది. అది ఆమె స్వస్థలం కావడంతో అక్కడే తాను భద్రంగా ఉంటుందనే ఆలోచనతో సుదీర్ఘమైన ప్రయాణాన్ని లిన్ కొనసాగిస్తున్నాడు. ఈ విషయాన్ని వివరిస్తూ తాను చేసిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. లిన్ నిర్ణయం పట్ల పలువురు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తుండగా.. మరికొందరు మాత్రం.. అంతదూరం ప్రయాణిస్తున్న లిన్ కు అతని భార్యతో గడపడానికి సమయం ఉంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ప్రేమ ఏమైనా చేయిస్తుంది.. ఎంత దూరమైనా తీసుకు వెళ్తుంది అంటూ పేర్కొన్నారు. మొత్తానికి భార్యపై లిన్ చూపుతున్న ప్రేమ నేటి యువతకు ఆదర్శమనే చెప్పొచ్చు.