Gold Price decreased : ఉగాది రోజున కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. ఆహా.. భారీ స్థాయిలో తగ్గుదల.. నేటి ధరలు ఇవే..
Gold Price decreased : ఉగాది పర్వదినం సందర్భంగా బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి భారీ శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి.

ఉగాది రోజున బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమైన వారికి భారీ శుభవార్త. గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పడిపోయాయి.

అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు బంగారం, వెండి ధరలను విపరీతంగా ప్రభావం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం బులియన్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే, పెట్టుబడిదారులు డాలర్ మీదకు తమ పెట్టుబడులు మళ్లించడంతో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 2,780 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 2,550 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 16డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 4,835 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధరసైతం భారీగా తగ్గింది. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. కిలో వెండిపై రూ.10వేలు తగ్గింది. దీంతో రెండు రోజుల్లోనే కిలో వెండిపై రూ.15వేలు తగ్గుదల చోటు చేసుకుంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,54,640కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,41,750 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,54,790 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,41,900 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,54,640కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,41,750 వద్దకు చేరింది.

వెండి ధర ఇవాళ భారీగా తగ్గింది. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,60,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
