Samantha : ఇంటర్వ్యూలో భర్తకు వీడియో కాల్ చేసిన సమంత.. రాజ్ ని సమంత ఏమని పిలుస్తుందో తెలుసా?
ఇంటర్వ్యూలో సమంత తన భర్త రాజ్ నిడిమోరుకు వీడియో కాల్ చేసి.. (Samantha)
Samantha
Samantha : సమంత త్వరలో ఇంటి బంగారం అనే సినిమాతో రాబోతుంది. నేడు ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత, యాంకర్ సుమ, డైరెక్టర్ నందిని రెడ్డితో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఉగాది పచ్చడి ఎలా చేయాలి అని సరదాగా ఈ ఇంటర్వ్యూ సాగింది. ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి మాట్లాడారు. అలాగే సమంత భర్త రాజ్ నిడిమోరు గురించి కూడా మాట్లాడారు.
ఈ ఇంటర్వ్యూలో సమంత తన భర్త రాజ్ నిడిమోరుకు వీడియో కాల్ చేసి.. హాయ్ బాబూ.. నేను ఉగాది పచ్చడి చేశాను అని చూపించింది. రాజ్ నువ్వు చేసావా అంటూ ఆశ్చర్యపోయారు. దీంతో ఈ క్యూట్ వీడియో వైరల్ గా మారింది. సమంత తన భర్త రాజ్ ని బాబూ అని పిలుస్తున్నట్టు తెలుస్తుంది.
Also See : ఉగాది స్పెషల్… యాంకర్ సుమ, సమంత స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా..?
సమంత గతంలో నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకొని విడిపోయిన తర్వాత దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరుతో ప్రేమలో పడి గత సంవత్సరం డిసెంబర్ లో రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ, వృత్తి పరంగా కలిసి సినిమాలు నిర్మిస్తూ, పలు బిజినెస్ లు కూడా నిర్వహిస్తున్నారు.
సమంత – యాంకర్ సుమ – నందిని రెడ్డి ఉగాది స్పెషల్ ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..
Also See : Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ వర్కింగ్ స్టిల్స్.. షేర్ చేసిన పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైలిస్ట్..
