Arjun Tendulkar : తన బ్యాట్‌తో పంత్‌ను ఆశ్చర్యపరిచిన అర్జున్ టెండూల్కర్.. నేనింతే.. ఇంతకంటే తక్కువ ఉంటే.. వీడియో వైరల్..
లక్నో సూపర్ జెయింట్స్ షేర్ చేసిన వీడియోలో పంత్, అర్జున్ లు (Arjun Tendulkar) తమ బ్యాట్ల గురించి మాట్లాడుకుంటూ కనిపించారు.
Arjun Tendulkar Leaves Rishabh Pant In Shock With Stunning Bat video viral
- మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026
- లక్నో జట్టుతో కలిసిన అర్జున్ టెండూల్కర్
- కెప్టెన్ రిషబ్ పంత్‌తో ఆసక్తికర చర్చ
Arjun Tendulkar : మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు తమ ప్రాక్టీస్ సెషన్లను మొదలు పెట్టాయి. ఐపీఎల్ 2026 వేలానికి ముందు ట్రేడింగ్‌లో ముంబై ఇండియన్స్ నుంచి అర్జున్ టెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అర్జున్ లక్నో జట్టుతో కలిశాడు. ఈ సందర్భంగా లక్నో జట్టు కెప్టెన్ రిషబ్ పంత్‌తో జరిగిన సంబాషణను సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లక్నో సూపర్ జెయింట్స్ షేర్ చేసిన ఈ వీడియోలో పంత్, అర్జున్ లు తమ బ్యాట్ల గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. ‘నా బ్యాట్ బరువు 1220 గ్రాములు. అంత కన్నా తక్కువ బరువు ఉన్న బ్యాట్ వాడను. ఇక నాన్న (సచిన్ టెండూల్కర్) అయితే 1310 నుంచి 1315 గ్రాముల బరువు ఉన్న బ్యాట్‌ను వాడేవాడు. ‘అని పంత్‌తో అర్జున్ అన్నాడు.
Already loving this new Rishabh-Arjun bond 🥹❤️💙 pic.twitter.com/pa79YqebbU
— Lucknow Super Giants (@LucknowIPL) March 18, 2026
బరువైన బ్యాట్ వాడటం వల్ల ప్రయోజనం ఏమిటని పంత్ అడగ్గా.. ‘మీరు చేయాల్సిందల్లా బంతిని తాకమే’ అని అర్జున్ చాలా సింపుల్‌గా సమాధానం ఇచ్చాడు.
ఇక తాను భారత దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌తో కలిసి క్రమం తప్పకుండా సాధన చేస్తున్నానని , తన పెళ్లి జరిగిన మరుసటి రోజు కూడా సాధన చేశానని అర్జున్.. పంత్‌కు చెప్పాడు. వెంటనే పంత్.. ‘మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడు, ఏ సాయం కావాలన్నా సరే అడుగు.’ అని అన్నాడు.
