Dalit boy beaten to death: రాజస్తాన్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాయావతి

విద్యార్థి చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటనను ఖండించడమనేది తక్కువ చేయడం అవుతుంది. రాజస్తాన్‭లో కులం పేరుతో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. దళితులు, గిరిజనులు నిర్లక్ష్యానికి గురై తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. రాజస్తాన్‭లోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టమవుతోంది.

Dalit boy beaten to death: నీళ్ల కుండ తాకినందుకు టీచర్ కొట్టిన దెబ్బలు తాళలేక విద్యార్థి చనిపోయిన ఘటనపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇంతటి హృదయ విదారక సంఘటనను ఖండించడం చాలా తక్కువని, ఇలాంటివి రాజస్తాన్ రాష్ట్రంలో షరా మామూలు అయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ రాజస్తాన్‭లో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని, అక్కడి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు.

‘‘రాజస్తాన్‭లోని జలోర్ జిల్లా సురానాలో ఒక ప్రైవేటు పాఠశాలలోని 9 ఏళ్ల దళిత విద్యార్థి, దాహం వేసి కుండలోని నీరు తాగాడు. అందుకు ఆ స్కూల్లోని ఉపాధ్యాయుడు విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. విద్యార్థి చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఈ హృదయ విదారక సంఘటనను ఖండించడమనేది తక్కువ చేయడం అవుతుంది. రాజస్తాన్‭లో కులం పేరుతో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. దళితులు, గిరిజనులు నిర్లక్ష్యానికి గురై తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. రాజస్తాన్‭లోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్పష్టమవుతోంది. కాబట్టి గెహ్లోత్ ప్రభుత్వాన్ని రద్దు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి’’ అని మాయావతి ట్వీట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్ రాష్ట్రం జలోర్ జిల్లాలో ఉన్న సురానా అనే గ్రామంలో జూలై 20న ఒక ప్రైవేటు స్కూలులో చదువుతున్న 9 ఏళ్ల బాలుడు.. స్కూల్లో ఉన్న నీటి కుండలోని నీళ్లు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న ఈ స్కూల్లోని టీచర్.. విద్యార్థిని చావగొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయాడు. సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అని బుద్ధులు నేర్పే బడిలో జరిగిన దారుణం ఇది.

ఈ విషయమై సామాజిక, రాజకీయ నేతలు, కార్యకర్తలు, నెటిజెన్ల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో రాజాస్తాన్‭లోని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్న గెహ్లోత్ ప్రభుత్వం అప్రమత్తమై బాధిత కుటుంబానికి 5 లక్షల పరిహారం ఇవ్వడంతో పాటు నిందితులకు కఠిణ శిక్ష వేస్తామని ప్రకటించింది.

BSP Supremo Mayawati: కాంగ్రెస్ కు దళితులపై ప్రేమ ఎపుడూ లేదు: రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన మాయావతి

ట్రెండింగ్ వార్తలు