Shivamogga: సావర్కర్ పోస్టర్ వివాదం.. కర్ణాటకలోని శివమొగ్గలో హైటెన్షన్

శివమొగ్గలోని అమీర్ అహ్మద్ సర్కిల్‭లో వీర్ సావర్కర్ పోస్ట్ పెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇస్లాంకు చెందిన సంఘాల వారు కొద్ది రోజుల క్రితం నిరసన చేపట్టారు. ఈ నిరసనను వ్యతిరేకిస్తూ హిందూ మతానికి చెందిన కొన్ని సంఘాల వారు కూడా నిరసనలు చేపట్టారు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య కొంత మాటల దాడి నడుస్తూనే ఉంది. ఘర్షణ జరగొచ్చనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

Shivamogga: హిజాబ్ వివాదం, రైట్ వింగ్ కార్యకర్త హత్య లాంటి ఘటనలతో మొన్నటి వరకు అట్టుడికిన కర్ణాటకలో మరో వివాదం తలెత్తింది. శివమొగ్గలోని ఒక కూడలిలో హిందూ మహా సభ నేత వీర్ సావర్కర్ పోస్టర్ పెట్టడం పెద్ద వివాదానికి దారి తీసింది. ప్రస్తుతం శివమొగ్గలో పరిస్థితి బాగోలేదని, దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు చేసినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు. దుకాణాలు అన్నీ మూసివేయించారు. అత్యవసరం అయితే ఎవరి బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితులు అదుపులోకి వచ్చే కర్ఫ్యూ కొనసాగనున్నట్లు వారు పేర్కొన్నారు.

విషయంలోకి వెళ్తే.. శివమొగ్గలోని అమీర్ అహ్మద్ సర్కిల్‭లో వీర్ సావర్కర్ పోస్ట్ పెట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇస్లాంకు చెందిన సంఘాల వారు కొద్ది రోజుల క్రితం నిరసన చేపట్టారు. ఈ నిరసనను వ్యతిరేకిస్తూ హిందూ మతానికి చెందిన కొన్ని సంఘాల వారు కూడా నిరసనలు చేపట్టారు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య కొంత మాటల దాడి నడుస్తూనే ఉంది. ఘర్షణ జరగొచ్చనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి భౌతిక దాడిలో గాయపడ్డట్టు వార్తలు రావడం శివమొగ్గలో పరిస్థితిని మరో వైపుకు తీసుకెళ్లింది. స్వయంగా రాష్ట్ర హోంమంత్రే ఈ విషయమై స్పందిస్తూ ‘‘శివమొగ్గలో ఒకరిని తీవ్రంగా కొట్టారు. బహుశా అది సావర్కర్ పోస్టర్ పైన జరిగి వివాదం కారణంగానే అయ్యుంటుందని తెలుస్తోంది. కానీ పూర్తి వివరాలు తెలియాలి’’ అని అన్నారు.

#IndependenceDay speech: లక్ష కేసుల్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సీఎం

ట్రెండింగ్ వార్తలు