Kalki Event : రేపే కల్కి ఈవెంట్.. భారీగా అభిమానుల సమక్షంలో.. ఎక్కడ.. ఏ టైంకి..?

కల్కి సినిమాలో భైరవ(ప్రభాస్ పాత్ర పేరు) బుజ్జి ఎవరో మే 22న చెప్తామని తెలిపింది మూవీ యూనిట్.

Kalki Event : ప్రభాస్ కల్కి సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో, భారీ కాస్ట్ తో హాలీవుడ్ రేంజ్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898AD సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే కల్కి సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పోస్టర్స్, స్క్రాచ్ వీడియోలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల కల్కి సినిమా నుంచి ప్రభాస్ బుజ్జిని రిలీజ్ చేస్తామని ప్రకటించి ఓ రోబో ఉన్న వీడియో రిలీజ్ చేశారు. ఓ చిన్ని రోబోకి కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ చెప్పిన వీడియో రిలీజ్ చేయగా అది వైరల్ అయింది. అసలు కల్కి సినిమాలో భైరవ(ప్రభాస్ పాత్ర పేరు) బుజ్జి ఎవరో మే 22న చెప్తామని తెలిపింది మూవీ యూనిట్.

తాజాగా దీనికి సంబంధించి ఓ అధికారిక ప్రకటన చేశారు. రేపు మే 22న హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో సాయంత్రం 5 గంటల నుండి భారీ వేడుకను నిర్వహించబోతున్నారు కల్కి టీం. ఇప్పటికే అక్కడ స్టేజి సెట్టింగ్ కూడా మొత్తం రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది. ఈ వేడుకలో బుజ్జి పాత్రని పరిచయం చేయబోతున్నారు. బుజ్జి అంటే సినిమాలో ప్రభాస్ పాత్ర వాడే వాహనం అని తెలుస్తుంది. దీంతో ప్రభాస్ అభిమానులు సంతోషిస్తున్నారు. రేపు రామోజీ ఫిలింసిటీకి ప్రభాస్ అభిమానులు భారీగా వెళ్లనున్నారు. కల్కి సినిమా మొదలు పెట్టినప్పటినుంచి ఇండియాలో చేసే మొదటి ఈవెంట్ ఇదే కావడంతో ఈవెంట్ పై కూడా అంచనాలు నెలకొన్నాయి. ఈ ఈవెంట్ కి ప్రభాస్ తో పాటు మూవీ యూనిట్ అంతా వస్తారని సమాచారం. ప్రభాస్ ఈ ఈవెంట్ కి హాజరవుతుండటంతో పబ్లిక్ లో చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని చూడబోతున్నాం అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఇక కల్కి సినిమాలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని నటిస్తుండగా వారితో పాటు మరికొంతమంది స్టార్ కాస్ట్ నటిస్తున్నారని సమాచారం. ఏకంగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాన్ వరల్డ్ పై కన్నేశాడు ప్రభాస్.

ట్రెండింగ్ వార్తలు