Amazon Great Indian Festival 2022 : అమెజాన్ ఫెస్టివల్ సీజన్‌ సేల్.. ఈ టిప్స్& ట్రిక్స్ పాటిస్తే భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.. డోంట్ మిస్..!

Amazon Great Indian Festival 2022 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో మెగా సేల్‌తో ముందుకు వస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ (Amazon Great Indian Festival 2022) అతి త్వరలో భారత మార్కెట్లో ప్రారంభం కానుంది.

Amazon Great Indian Festival 2022 : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో మెగా సేల్‌తో ముందుకు వస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ (Amazon Great Indian Festival 2022) అతి త్వరలో భారత మార్కెట్లో ప్రారంభం కానుంది. అయితే ఏ తేదీ అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ, కంపెనీ ఇప్పటికే ఒక మైక్రో-సైట్‌ (Amazon Micro-Site)ను రూపొందించింది. అందులో ఏయే ప్రొడక్టులపై ఎలాంటి డిస్కౌంట్లు, ఆఫర్‌లను అందించనుందో వెల్లడించింది. ఉదాహరణకు, స్మార్ట్‌ఫోన్ కేటగిరీపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందించనుంది.

హోమ్, కిచెన్ కేటగిరీపై 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ పేర్కొంది. అమెజాన్ ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) కూడా తమ మెగా సేల్ సంబంధించి కస్టమర్‌ల కోసం భారీ సేల్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తోంది. రాబోయే సేల్ ఈవెంట్ కోసం ఎదురు చూసే కస్టమర్లకు మరింత ఈజీగా షాపింగ్ చేసేందుకు వీలుగా అద్భుతమైన ఆఫర్లను అందించనుంది. ఇందులో బెస్ట్ డీల్‌లు, ప్రొడక్టులపై మరింత డిస్కౌంట్లను పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ కింది విధంగా టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. అప్పుడే తక్కువ ధరకే మీకు నచ్చిన డీల్స్ సొంతం చేసుకోవచ్చు.

Amazon Great Indian Festival 2022_ Tips and tricks to shop efficiently this festive season

1. Amazon Prime Account :
అమెజాన్ సేల్ సమయంలో ప్రైమ్ మెంబర్‌లు (Prime Members) నాన్-ప్రైమ్ మెంబర్ల కన్నా ముందే సేల్ షాపింగ్ మొదలు పెట్టవచ్చు. అంటే మెగా సేల్ ప్రారంభానికి ఒక రోజు ముందుగానే ప్రైమ్ కస్టమర్లు అనేక ఆఫర్‌లు, డీల్‌లకు యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఐఫోన్‌ల వంటి లగ్జరీ ప్రొడక్టులను కొనుగోలు చేయాలనుకుంటే అతి త్వరలోనే మీకు అందుబాటులోకి రానున్నాయి. సేల్ ఈవెంట్‌తో సంబంధం లేకుండా.. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ (Amazon Prime Membership) చాలా బెనిఫిట్స్ అందిస్తుంది. ప్రైమ్ వీడియో (Prime Video)కి కూడా యాక్సెస్‌ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఆఫ్‌లైన్ వినియోగం కోసం కస్టమర్లు అమెజాన్ మ్యూజిక్‌ (Amazon Music)లో పాటలు, పాడ్‌కాస్ట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ సభ్యులు కిండ్ల్‌లో కూడా ఉచితంగా పుస్తకాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

2. Track prices :
Amazon, Flipkartలో ప్రొడక్టుల ధరల్లో మార్పులు ఉంటాయి. ఏది ఎంత ధర ఉందో తెలుసుకునేందుకు కొన్ని సైట్‌లు ఉపయోగపడతాయి. అయినప్పటికీ, Amazon డెస్క్‌టాప్, యూజర్ల డీల్స్ చూడాలంటే ఇతర సైట్‌లపై ఆధారపడాలి. అలాంటప్పుడు, మీరు BuyHatke, Keepaని వెబ్ సైట్లను చెక్ చేయవచ్చు. ఈ సైట్‌లు వారం లేదా నెలలో డీల్‌లకు సంబంధించి మీకు వివరాలను అందిస్తాయి. మీకు కావలసిన ప్రొడక్టు ఎంత తక్కువ ధరకు అందుబాటులో ఉందో చెక్ చేసుకోవచ్చు. సేల్ ఈవెంట్ వరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

3. Save your card :
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Amazon Great Indian Festival 2022) వంటి సేల్ ఈవెంట్‌లలో ఆపిల్ iPhone, మరిన్ని హాట్ ప్రొడక్టులు త్వరగా సేల్ అవుతాయి. తద్వారా పేమెంట్ ఈజీగా ఉండేందుకు వీలుగా వినియోగదారుల కార్డ్ వివరాలు సేవ్ చేయడం జరుగుతుందని నిర్ధారించుకోవాలి.

Amazon Great Indian Festival 2022_ Tips and tricks to shop efficiently this festive season

4. ‘blockbusters’ డీల్‌ చూసి తొందరపడొద్దు :
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేజీని చెక్ చేస్తే.. ‘8 PM డీల్స్’ ‘రూ. 999 లోపు సేల్ డీల్ అనే స్పెషల్ కేటగిరీని చూడవచ్చు. ఈ డీల్‌లు తప్పనిసరిగా మీరు కోరుకున్న ప్రొడక్టులపై డిస్కౌంట్లను అందించకపోవచ్చు. మీరు కొనుగోలు చేసే ప్రొడక్టు లేదా స్మార్ట్‌ఫోన్ అనేది ఎంచుకోండి. మీ బడ్జెట్‌లో అందుబాటులో ఉంటే సమయాన్ని వృథా చేయొద్దు. వీలైనంత త్వరగా ఇప్పుడే కొనేసుకోండి.

5. యాప్‌, పర్సనల్ డేటాను అప్‌డేట్ చేయండి :
వినియోగదారులు యాప్ లేటెస్ట్ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఈ డివైజ్ సరిగ్గా చేరాలంటే కస్టమర్‌లు తప్పనిసరిగా వారి అడ్రస్ సరిగా అప్‌డేట్ చేయాలి లేదా కొత్త అడ్రస్ యాడ్ చేయాలి. అమెజాన్ చాలా ఎలక్ట్రానిక్స్‌పై No-cost EMI, Exchange ఆప్షన్లను అందిస్తోంది. అయితే ఎలాంటి రూల్స్, నిబంధనలు, షరతులు ఉన్నాయో ముందే నిర్ధారించుకోండి.

Read Also : Amazon Great Indian Festival Sale : అమెజాన్ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 13, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్లు.. ఎప్పుడంటే?

ట్రెండింగ్ వార్తలు