Phone Hacked : సైబర్ మోసగాళ్లతో జాగ్రత్త.. గుజరాత్ డెవలపర్ ఫోన్ హ్యాక్ చేసి.. కేవలం 30 నిమిషాల్లోనే రూ. 37 లక్షలు కొట్టేశారు..!

Phone Hacked : గత కొన్ని ఏళ్లుగా సైబర్ మోసం కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రతిదీ డిజిటల్‌గా మారడంతో సైబర్ నేరగాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. నేరుగా బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బును దొంగిలిస్తున్నారు. సైబర మోసగాళ్లకు ఇంటర్నెట్ హాట్‌స్పాట్‌గా మారింది.

Phone Hacked : గత కొన్ని ఏళ్లుగా సైబర్ మోసం కేసులు గణనీయంగా పెరిగాయి. ప్రతిదీ డిజిటల్‌గా మారడంతో సైబర్ నేరగాళ్లు ఇంకా రెచ్చిపోతున్నారు. నేరుగా బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బును దొంగిలిస్తున్నారు. సైబర మోసగాళ్లకు ఇంటర్నెట్ హాట్‌స్పాట్‌గా మారింది. అమాయక వినియోగదారులను మోసగించి OTPని పొందడం ద్వారా సున్నితమైన డేటాను దొంగిలిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు యూజర్ల స్మార్ట్‌ఫోన్‌లకు యాక్సెస్ చేసేందుకు ఫిషింగ్ లింక్‌లను పంపుతున్నారు. అయితే, ఇటీవలి కేసులో, గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి సైబర్ మోసగాళ్లకు ఎలాంటి OTPని కూడా షేర్ చేయకుండా లేదా ఏదైనా అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేయకుండానే లక్షల్లో నగదును పోగొట్టుకున్నాడు.

గుజరాత్‌లోని మెహసానాలో నమోదైన సైబర్ ఫ్రాడ్ కేసు అందరినీ షాకింగ్ గురిచేసింది. డెవలపర్‌గా పనిచేస్తున్న దుష్యంత్ పటేల్ అనే వ్యక్తి.. తాను OTP లేదా మరే ఇతర పర్సనల్ డేటాను ఎవరితోనూ షేర్ చేయలేదు. అయినప్పటికీ సైబర్ నేరగాళ్లు తన బ్యాంక్ అకౌంట్ల నుంచి 30 నిమిషాల వ్యవధిలో రూ. 37 లక్షలు దొంగిలించారంటూ అతడు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. నివేదిక ప్రకారం.. పటేల్ తన ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు డిసెంబర్ 31న అకౌంట్లో లావాదేవీలకు సంబంధించి మెసేజ్ వచ్చాయి. ఆ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు తన అకౌంట్ నుంచి రూ.10 లక్షలు డ్రా అయినట్లు బ్యాంకు నుంచి నోటిఫికేషన్ వచ్చింది. కాసేపటి తర్వాత మధ్యాహ్నం 3:20 గంటల ప్రాంతంలో మరో రూ.10 లక్షలు డ్రా అయినట్లు మరో మెసేజ్ వచ్చింది.

బ్యాక్-టు-బ్యాక్ అనధికారిక లావాదేవీ నోటిఫికేషన్‌లు రావడంతో పటేల్ బ్యాంకుకు వెళ్లి విత్‌డ్రావల్స్ గురించి అధికారులకు ఫిర్యాదు చేశాడు. మరోసారి తన బ్యాంకు అకౌంట్ల విత్‌డ్రాలు జరగకుండా ఆపేందుకు వెంటనే ఫ్రీజ్ చేయాలని అభ్యర్థించాడు. అయితే, పటేల్ ఫిర్యాదు చేసేందుకు బ్యాంకులో ఉండగా 3:49 గంటలకు రూ.17 లక్షల లావాదేవీకి సంబంధించి మరో మెసేజ్ వచ్చింది. బాధిత వ్యక్తి పటేల్ మొత్తం రూ.37 లక్షలు పోగొట్టుకున్నట్లు సమాచారం. నెట్ బ్యాంకింగ్ ద్వారా తన అకౌంట్ యాక్సెస్ చేయలేకపోయాడు. అతని యూజర్ నేమ్, పాస్‌వర్డ్ వ్యాలీడ్ కాదంటూ మెసేజ్ కూడా వచ్చినట్టు తేలింది.

Phone hacked_ Developer from Gujarat receives back to back transaction 

Read Also : QR Code Scam : QR కోడ్ స్కామ్‌తో తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి స్కామర్ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలి? ఎలా గుర్తించాలో తెలుసా?

బ్యాంకు అధికారులు అతని అకౌంట్ ఫ్రీజ్ చేసిన అనంతరం తాను సైబర్ మోసగాళ్ల చేతుల్లో మోసపోయినట్లు పటేల్‌కు తెలియజేశారు. కేసు నమోదు చేసిన తర్వాత సైబర్ క్రైమ్ బ్రాండ్ కేసును దర్యాప్తు ప్రారంభించింది. తనకు ఎలాంటి OTP లేదా ఇతర డేటా ఎవరితోనూ షేర్ చేయలేదని బాధితుడు వాపోయాడు. సైబర్ నేరగాళ్లు అతని స్మార్ట్‌ఫోన్‌లను హ్యాక్ చేసి అతని బ్యాంక్ అకౌంట్ వివరాలను దొంగిలించవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఇప్పటికీ కేసును పరిశోధిస్తున్నారు సైబర్ నేరగాళ్లు పటేల్ బ్యాంక్ డేటాను ఎలా యాక్సెస్ చేశారో గుర్తించే పనిలో పడ్డారు. వాస్తవానికి సైబర్ నేరగాళ్లు పటేల్ బ్యాంకు అకౌంట్లను ఎలా యాక్సస్ చేశారు అనేదానికి అనేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

హ్యాకర్లు మీ స్మార్ట్‌ఫోన్‌ను ఎలా హ్యాక్ చేయొచ్చు? :
ఫిషింగ్ : హ్యాకర్లు బాధితుల ఫోన్‌లకు డేంజరస్ లింక్‌లను పంపుతారు. బాధితుడు లింక్‌ను ఓపెన్ చేసిన వెంటనే, లింక్‌కి యాడ్ చేసిన మాల్వేర్ ఫోన్‌కు ఇంజెక్ట్ అవుతుంది. అప్పుడు హ్యాకర్లు డివైజ్ యాక్సస్ పొందుతారు.

డేంజరస్ యాప్‌లు : ఎవరైనా Google Play లేదా యాప్‌ల స్టోర్ లేదా అధికారిక యాప్‌ల స్టోర్‌లు కాకుండా అవిశ్వసనీయ లేదా తెలియని మార్గాల్లో నుంచి ఏదైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే డౌన్‌లోడ్ చేసిన యాప్‌కి ఏదైనా మాల్వేర్ యాడ్ చేసి ఉండవచ్చు.

జ్యూస్ జాకింగ్ : ఈ పద్ధతిలో సైబర్ నేరస్థులు USB కేబుల్ కనెక్షన్ ద్వారా ఫోన్‌లలో Malwarebytesని ఇన్‌స్టాల్ చేస్తారు. పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లను ఉపయోగించకుండా ఉండాలి. లేదంటే.. మీ ఫోన్‌ను ఏదైనా అవిశ్వసనీయ UCBకి కనెక్ట్ చేయరాదని గుర్తించుకోవాలి.

సోషల్ మీడియా లింక్‌లు : ‘మీ ఫొటో వయస్సును తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి. ‘స్పెషల్ డిస్కౌంట్ ఉంది’ లేదా ఇలాంటి లింక్‌లు తరచుగా మాల్వేర్‌ను కలిగి ఉంటాయి. యూజర్లు ఎవరైనా ఈ హ్యాకర్ల లింకులపై క్లిక్ చేసినప్పుడల్లా మొబైల్ ఫోన్‌కు యాక్సెస్ పొందుతారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : 5G Scam : వోడాఫోన్ ఐడియా యూజర్లు జాగ్రత్త.. మీ ఫోన్‌కు ఇలా 5G నెట్‌‌వర్క్ మెసేజ్ వచ్చిందా? ఇదో పెద్ద స్కామ్.. ఈ లింక్ క్లిక్ చేయొద్దు!

ట్రెండింగ్ వార్తలు