QR Code Scam : QR కోడ్ స్కామ్‌తో తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి స్కామర్ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలి? ఎలా గుర్తించాలో తెలుసా?

QR code Scam : ఆన్‌లైన్ క్యూర్ కోడ్ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త.. ప్రత్యేకించి యూపీఐ (UPI), డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా చేసేవారిపైనే స్కామర్లు లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు.

QR code Scam : ఆన్‌లైన్ క్యూర్ కోడ్ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త.. ప్రత్యేకించి యూపీఐ (UPI), డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా చేసేవారిపైనే స్కామర్లు లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణంగా SMS పంపడం లేదా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లతో వినియోగదారులు ఏదైనా బ్యాంక్ అకౌంట్ల నుంచి సెకన్లలో నగదు బదిలీని ప్రారంభించవచ్చు. డిజిటల్ పేమెంట్లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేసుకునే వీలుంది. కానీ మరోవైపు, ఆన్‌లైన్ మోసాల రేటు కూడా పెరిగిపోయింది.

గత కొన్ని ఏళ్లుగా ఫిషింగ్ లింక్‌లు, సిమ్ స్వాపింగ్, విషింగ్ కాల్స్ వంటి మరిన్నింటి ద్వారా సైబర్ మోసాలు గణనీయంగా పెరిగాయి. స్కామర్లు అమాయక ప్రజలను మోసం చేసేందుకు ఏదో ఒక కొత్త మార్గాలను ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. అందులో ఒకటి QR కోడ్ స్కామ్ (QR Code Scam). చాలా మంది యూజర్లు QR కోడ్ స్కామ్‌ల బారినపడుతున్నారు. మోసగాళ్ళు QR కోడ్‌ని ఉపయోగించి యూజర్ల బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేసేస్తున్నారు.

ఇటీవల వాట్సాప్‌లో క్యూఆర్ కోడ్‌ను పంపి.. పేమెంట్ చేయమని స్కామర్లు అడుగుతున్నారు. పేమెంట్ స్వీకరించడానికి అది స్కాన్ చేయమని అడుగుతారు. లేదంటే అదేపనిగా ఫోన్ కాల్ చేస్తుంటారు.. SMSలు పంపిస్తుంటారు. ఒకవేళ QR కోడ్‌ని ఉపయోగించి నగదు పంపితే అంతే సంగతి..

మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేసేస్తారు స్కామర్లు.. రిసీవర్‌ని కోడ్‌ని స్కాన్ చేయగానే.. నగదును స్వీకరించడానికి OTPని ఎంటర్ చేయమని కోరుతుంటారు మోసగాళ్లు. చాలా మంది అమాయకులు తరచుగా మోసగాళ్ల వలలో చిక్కుకుంటారు. OLX QR కోడ్ స్కామ్ ద్వారా మోసగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పుడుతున్నారు. అసలు QR కోడ్ స్కామ్ అంటే ఏంటి? QR కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా నగదును స్కామర్లు ఎలా దొంగలిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : 5G Scam Alert : 4G to 5G యాక్టివేషన్ అంటూ సైబర్ మోసగాళ్లు ఎన్ని మార్గాల్లో మోసం చేయొచ్చుంటే? తస్మాత్ జాగ్రత్త!

QR కోడ్ స్కామ్ అంటే ఏంటి? :
QR కోడ్ ద్వారా పేమెంట్ చేయడం ద్వారా ఒకరి నుంచి మరొకరికి డబ్బులను పంపుకోవచ్చు. ఇందులో రిసీవర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలాగే పంపాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేసి.. ఆపై OTPని ఎంటర్ చేయాలి. ముఖ్యంగా, QR కోడ్ నగదు పంపడానికి మాత్రమే స్కాన్ చేయాల్సి ఉంటుంది.

Beware of QR code scam or lose money_ how to identify and be safe from such scams

డబ్బును రిసీవ్ చేయడానికి కాదనే విషయాన్ని తప్పక గుర్తించుకోవాలి. కానీ, స్కామర్లు చాలామంది అమాయకులను డబ్బులు పంపేందుకు QR కోడ్‌ని స్కాన్ చేయమని అడుగుతారు. అప్పుడు OTPని నమోదు చేయాల్సిందిగా కోరుతారు. అప్పుడు పంపిన వారి అకౌంట్ నుంచి నగదు కాజేస్తారు. అందుకే ఇలాంటి మోసాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

QR కోడ్ స్కామ్‌లను ఎలా అడ్డుకోవాలంటే? :
* మీ UPI ID లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను తెలియని వ్యక్తులతో ఎప్పుడూ షేర్ చేయొద్దు.
* మీరు OLX లేదా ఇతర సైట్‌లలో ఏదైనా కొనుగోలు చేస్తే క్యాష్‌తో మాత్రమే చేయండి.
* మీరు ఎక్కువ మొత్తంలో పేమెంట్ చేయాల్సి వస్తే.. QR కోడ్‌ను ఎప్పుడూ స్కాన్ చేయొద్దు.
* నగదు పంపేటప్పుడు కూడా QR కోడ్ స్కానర్ చూపించే వివరాలను క్రాస్ చెక్ చేయండి.
* QR కోడ్ మరొక QR కోడ్‌ను కవర్ చేసే స్టిక్కర్ లాగా కనిపిస్తే.. అది స్కాన్ చేయడం మానుకోండి.
* OTPని ఎవరితోనూ షేరింగ్ చేయవద్దు.
* OTPలు కాన్ఫిడెన్షియల్ నెంబర్లు, మీరు వాటిని అలాగే పరిగణించాలి.
* మీరు ఏదైనా అమ్మడం లేదా కొనుగోలు చేస్తే మాత్రం ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో యూజర్ల గుర్తింపును ఎల్లప్పుడూ ధృవీకరించండి.
* అవసరం లేదంటే.. మాత్రం..ఎట్టిపరిస్థితుల్లోనూ మీ మొబైల్ నంబర్‌ను కూడా షేర్ చేయకపోవడమే మంచిది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Best Smartphones 2022 : 2022లో అత్యంత సరసమైన 4 బెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు