Hardik Pandya : రెండు నెల‌ల ముందు జీరో.. ఇప్పుడు హీరో.. ద‌టీజ్ హార్దిక్ పాండ్యా..

టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాకు రెండు నెల‌ల క్రితం ఎంతో క‌ష్ట‌మైన కాలంగా చెప్ప‌వ‌చ్చు.

Hardik Pandya chants : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్, ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాకు రెండు నెల‌ల క్రితం ఎంతో క‌ష్ట‌మైన కాలంగా చెప్ప‌వ‌చ్చు. రోహిత్ శ‌ర్మ‌ను కాద‌ని ముంబై కెప్టెన్‌గా అత‌డిని నియ‌మించ‌డాన్ని అభిమానులు జీర్ణించుకోలేక‌పోయారు. దీంతో ముంబై, రోహిత్ అభిమానుల నుంచి హార్దిక్‌కు తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. మైదానంలో, బ‌య‌ట ఎక్క‌డ క‌నిపించినా కూడా అత‌డికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

అదే స‌మ‌యంలో ముంబై వ‌రుస ఓట‌ముల‌తో ప్లే ఆఫ్స్‌కు చేరుకోవ‌డంలో విఫ‌లం కావ‌డంతో హార్దిక్ మ‌రిన్ని చీత్కారాల‌ను ఎదుర్కొవాల్సి వ‌చ్చింది. కాలం గిర్రున తిర‌గింది. ఒక నెల గడిచిపోయింది. టీమ్ఇండియా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచింది. దీంతో ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. భార‌త విజ‌యాల్లో పాండ్యా కీల‌క పాత్ర పోషించ‌డంతో మ‌ళ్లీ అభిమానుల మ‌న‌సుల‌ను గెలుచుకున్నాడు.

Mahmudullah : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఓట‌మి.. మ‌రో స్టార్ ఆల్‌రౌండ‌ర్‌ క్రికెట్‌కు వీడ్కోలు..

ప్ర‌పంచ‌క‌ప్‌తో భారత జ‌ట్టు ఢిల్లీలో అడుగుపెట్టింది. అక్క‌డి నుంచి ముంబైకి చేరుకుంది. భార‌త ప్లేయ‌ర్లకు ఘ‌న స్వాగ‌తం ప‌లికేందుకు ముంబై అభిమానులు పెద్ద సంఖ్య‌లో వ‌చ్చారు. టీమ్ఇండియా ప్లేయ‌ర్లు ఇంకా రాక‌ముందే.. వాంఖ‌డే స్టేడియం మొత్తం జ‌న‌సంద్రంగా మారింది. స్టేడియం మొత్తం హార్దిక్ నామ‌స్మ‌ర‌ణ‌తో నిండిపోయింది. రెండు నెల‌ల ముందు ఏ గ్రౌండ్‌లోనైతే అవ‌మానాలు ఎదుర్కొన్నాడో అప్పుడు అక్క‌డే హార్దిక్ రాజాలా త‌లెత్తుకుని నిల‌బ‌డ్డాడు. క‌ష్ట‌మైన ద‌శ‌ను దాట‌డానికి హార్దిక్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు.

ట్రెండింగ్ వార్తలు