Pawan Kalyan : ఆ రెండు సినిమాలు అంతేసంగతులా?
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్..
- Thota Vamshi Kumar
- Published On : July 4, 2024 / 10:00 PM IST
What about the movies of Pawan who is busy in politics
ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రాజకీయాల్లో ఫుల్ బిజీ అయ్యారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. డిప్యూటీ సీఎంగా కీలక శాఖలను పర్యవేక్షిస్తున్న మంత్రిగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్న పవన్…. ఇక సినిమాల్లో నటిస్తారా? లేదా? ఇప్పటికే కమిట్ అయిన సినిమాల సంగతేంటి? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఐతే నటనకు కొంత సమయం కేటాయిస్తానని ఈ చర్చకు పుల్‌స్టాప్ పెట్టిన పవన్… తను నటించిన ఓజీ సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చేశారు. ఓజీపై క్రేజీ కామెంట్ చేసిన పవన్… మిగిలిన రెండు సినిమాలను సస్పెన్స్‌లో ఉంచేశారు. మరి ఆ రెండు సినిమాల సంగతేంటి? ఆ చిత్రాల కెప్టెన్లు ఏమనుకుంటున్నారు?
ఏపీలో అధికారంలోకి వెళ్లిన తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానులతో స్వీటు లాంటి మాటలు పంచుకున్నారు. రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ ఇటీవల కాలంలో సినిమాలు తగ్గించేసి అభిమానులకు నిరాశ మిగిల్చారు. ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం షెడ్యూల్‌లో ఉన్న మూడు సినిమాల షూటింగ్ పెండింగ్‌లో పడిపోయింది.
Young Hero’s : భారీ బడ్జెట్ సినిమాలతో రిస్క్ చేస్తున్న మీడియం హీరోలు..
ఐతే పవన్ నటించిన ఓజీ మాత్రం దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు.. ఓజీ రిలీజ్‌పై పవన్‌నే సూటిగా ప్రశ్నించడంతో సినిమా చాలా క్రేజీగా ఉంటుందని.. త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేశారు పవన్. దీంతో పవన్ అభిమానులు ఖుషీ అవుతుండగా, షెడ్యూల్‌లోనే ఉన్న మిగిలిన రెండు సినిమాలు సంగతేంటన్న ప్రశ్న మొదలైంది.
ప్రస్తుతం పవన్ నటిస్తున్న మూడు సినిమాలు షెట్స్‌పై ఉన్నాయి. వాటిలో హరిహర వీరమల్లు రెండు పార్ట్‌లుగా చిత్రీకరిస్తుండగా, మిగిలిన రెండింట్లో ఒకటి ఓజీ, అదేవిధంగా ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమా కూడా షెట్స్‌పై ఉంది. ఐతే ఈ మూడు సినిమాల్లో ఓజీ షూటంగ్ పూర్తియి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని చెబుతున్నారు. దీంతో ఓజీనే ముందుగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఆ చిత్ర దర్శకుడు కూడా షూటింగ్ మొదలైన నుంచి ఆ ఒక్క సినిమాపైనే పని చేస్తుంటడం వల్ల షూటింగ్ త్వరగా పూర్తి చేయగలిగాడట.. ఇక హరిహర వీరమల్లు సినిమాకు ఇప్పటికే ఇద్దరు డైరెక్టర్లు మారారు.
Ashwatthama – Amitabh : ‘కల్కి’ సెట్లో ‘అశ్వత్థామ’గా అమితాబ్ విగ్రహం చూశారా? ఎంత భారీగా ఉందో..
ఈ సినిమా స్టార్ట్ చేసిన క్రిష్ ఎప్పుడో తప్పుకోగా, ప్రస్తుతం నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ డైరెక్షన్ బాధ్యతలు చూస్తున్నారు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా దర్శకుడు హరీశ్‌శంకర్.. వేరే చిత్రాలను నిర్మించడం వల్ల ఆ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. కానీ పవన్ సినిమా అంటే క్రేజ్ మామూలుగా ఉండదు కదా.. అందుకే షూటింగ్‌లో ఉన్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయా? అని ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఫ్యాన్స్ ఆత్రుతను గమనించిన పవన్ ఓజీపై క్లారిటీ ఇచ్చి సస్పెన్స్‌ను తొలగించగా, తమ సినిమాలపై స్పందించకపోవడంపై హర్ట్ అయ్యారట ఆ సినిమా కెప్టెన్లు. మరి బ్యాలెన్స్ ఉన్న రెండు సినిమాలను పవన్ ఎప్పుడు పూర్తి చేస్తారన్నదే ఆ చిత్ర యూనిట్‌లతోపాటు అభిమానులకు ఉత్కంఠగా మారింది.
