Young Hero’s : భారీ బడ్జెట్ సినిమాలతో రిస్క్ చేస్తున్న మీడియం హీరోలు..

ఇప్పుడు చిన్న, మీడియం హీరోలు కూడా తమ బడ్జెట్ కి మించిన సినిమాలు చేస్తున్నారు.

Young Hero’s : భారీ బడ్జెట్ సినిమాలతో రిస్క్ చేస్తున్న మీడియం హీరోలు..

Young Medium Tollywood Heros Doing Movies with High Budget and Taking Risk

Young Hero’s : ఒకప్పుడు స్టార్ హీరోలు, పెద్ద హీరోలు మాత్రమే భారీ బడ్జెట్ సినిమాలు చేసేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న, మీడియం హీరోలు కూడా తమ బడ్జెట్ కి మించిన సినిమాలు చేస్తున్నారు. చిన్న హీరోలు పెద్ద సాహసమే చేస్తున్నారు. గట్టిగా 20 కోట్లు మార్కెట్ లేని హీరోలు కూడా 50 నుంచి 100కోట్ల బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోలే సినిమా అటూ ఇటైతే కష్టమని ఆచితూచి బడ్జెట్ పెట్టుకుంటుంటే ఈ చిన్న హీరోలు మాత్రం కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు.

లేటెస్ట్ గా సాయిదరమ్ తేజ్ అయితే ఏకంగా 120 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. రోహిత్ డైరెక్షన్లో నిరంజన్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా హై ఆక్టేన్ యాక్షన్ మూవీ కాబట్టి అంత బడ్జెట్ ఉండాల్సిందే అని టీమ్ ఫీలయినట్టు తెలుస్తోంది. అందుకే విరూపాక్షతో 103 కోట్లు కలెక్ట్ చేసిన సాయిధరమ్ తేజ్ మీద అంత ధైర్యంగా 120 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసే సాహసం చేస్తున్నారు.

Also Read : Vishwambhara Update : మెగాస్టార్ ‘విశ్వంభర’ అప్డేట్.. డబ్బింగ్ మొదలు.. షూటింగ్ అయిపోయిందా?

గట్టిగా 25కోట్లు కూడా రాబట్టని కిరణ్ అబ్బవరం కూడా ఏకంగా 20 కోట్ల బడ్జెట్ తో సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. సుజిత్, సందీప్ డైరెక్టర్లుగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న కిరణ్ అబ్బవరం సినిమా 20 కోట్లతో భారీగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కతున్న మట్కా కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది. కొన్నాళ్లుగా వరసగా ఫ్లాపుల్లో ఉన్న వరుణ్ తేజ్ దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో మట్కా అనే రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కిస్తోంది. ఇప్పటికే 15కోట్లతో సెట్లు వేసి భారీ షెడ్యూల్ చేస్తున్న డైరెక్టర్ కరుణ కుమార్ అండ్ టీమ్ ఈ సినిమాని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. నిజానికి వరుణ్ తేజ్ మీద ఇంత బడ్జెట్ ఎక్కువే అని ఫీలవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకూ ఇంత భారీ సక్సెస్ వరుణ్ తేజ్ ఎక్స్‌పీరియన్స్ చెయ్యకపోవడంతో ఇంత బడ్జెట్ రిస్క్ అన్న టాక్ నడుస్తోంది. వీరితో పాటు చాలా మంది యువ హీరోలు తమ మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టి సినిమాలు తీయడంలో బిజీ అయ్యారు. మరి అవి సక్సెస్ అయి హీరోల మార్కెట్ ని పెంచుతాయా లేక బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయి ఇలాంటి రిస్క్ లు వద్దు అని వార్నింగ్ ఇస్తాయా చూడాలి.