Vishwambhara Update : మెగాస్టార్ ‘విశ్వంభర’ అప్డేట్.. డబ్బింగ్ మొదలు.. షూటింగ్ అయిపోయిందా?

తాజాగా విశ్వంభర డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశామని తెలిపారు మూవీ యూనిట్.

Vishwambhara Update : మెగాస్టార్ ‘విశ్వంభర’ అప్డేట్.. డబ్బింగ్ మొదలు.. షూటింగ్ అయిపోయిందా?

Mgastar Chiranjeevi Vishwambhara Movie Update Dubbing Works Started

Updated On : July 4, 2024 / 11:50 AM IST

Vishwambhara Update : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ కథతో భారీగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఎక్కువగా గ్రాఫిక్స్ ఉండటంతో స్పెషల్ సెట్స్ వేసి మరీ షూట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 60 శాతం షూటింగ్ కూడా పూర్తయిందని సమాచారం.

అయితే తాజాగా విశ్వంభర డబ్బింగ్ కూడా మొదలుపెట్టేశామని తెలిపారు మూవీ యూనిట్. ఇవాళ విశ్వంభర సినిమా డబ్బింగ్ వర్క్ పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టినట్టు పలు ఫొటోలు షేర్ చేసి మూవీ యూనిట్ తెలిపింది. దీంతో మూవీ షూటింగ్ అప్పుడే అయిపోయిందా, ఎడిటింగ్ అయిపోయిందా అని సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

Also Read : Balakrishna – Venkatesh : బాలయ్య, వెంకీమామలతో కుష్బూ, శోభన స్పెషల్ సెల్ఫీలు..

అయితే ఓ పక్కన మూవీ షూటింగ్ చేస్తూనే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా చేయనున్నారు. ఇప్పటివరకు పూర్తయినంతవరకు డబ్బింగ్ చేయిస్తారని తెలుస్తుంది. ఒకేసారి షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ జరిగితే మరింత ఫాస్ట్ గా సినిమా పూర్తవుతుందని, చెప్పిన టైంకి రిలీజ్ చేస్తామని భావిస్తున్నారు. విశ్వంభర సినిమా వచ్చే సంక్రాంతి బరిలో 2025 జనవరి 10న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించారు మూవీ యూనిట్. ఇంత ఫాస్ట్ గా వర్క్ జరగడం, అప్పుడప్పుడు సెట్స్ నుంచి ఫొటోలు విడుదల చేయడం, ఇలా అప్డేట్స్ ఇవ్వడంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.