Balakrishna – Venkatesh : బాలయ్య, వెంకీమామలతో కుష్బూ, శోభన స్పెషల్ సెల్ఫీలు..

సీనియర్ నటి కుష్బూ, శోభన, కుష్బూ భర్త సుందర్ కలిసి బాలకృష్ణ, వెంకటేష్ లతో సెల్ఫీలు దిగారు.

Balakrishna – Venkatesh : బాలయ్య, వెంకీమామలతో కుష్బూ, శోభన స్పెషల్ సెల్ఫీలు..

Kushboo and Shobana Special Selfies with Balakrishna and Venkatesh in Varalaxmi Sarathkumar Wedding Reception

Updated On : July 4, 2024 / 11:36 AM IST

Balakrishna – Venkatesh : తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ – నికోలయ్ సచ్ దేవ్ వెడ్డింగ్ రిసెప్షన్ చెన్నైలో గ్రాండ్ గా నిన్న రాత్రి జరిగింది. వీరి రిసెప్షన్ కి తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ పరిశ్రమ నుంచి అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. పలువురు తమిళ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్, అయన భార్య రాధికా సీనియర్ నటులు అని తెలిసిందే. ఈ ఇద్దరూ గతంలో అన్ని పరిశ్రమలలో నటించడంతో వరలక్ష్మి పెళ్ళికి తమకు అన్ని పరిశ్రమలలో ఉన్న సన్నిహితులని పిలిచారు.

Also See : Varalaxmi Nicholai Sachdev Reception : వరలక్ష్మి శరత్ కుమార్ రిసెప్షన్ ఫొటోలు..

ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి తెలుగు పరిశ్రమ నుంచి కూడా చాలా మంది హాజరయ్యారు. ఈ వేడుకల్లో చాలా మంది సీనియర్ నటీనటులు కలిసి అప్పటి రోజులు గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటి కుష్బూ, శోభన, కుష్బూ భర్త సుందర్ కలిసి బాలకృష్ణ, వెంకటేష్ లతో సెల్ఫీలు దిగారు. సరదాగా దిగిన ఈ సెల్ఫీలు కుష్బూ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

View this post on Instagram

A post shared by Kushboo Sundar (@khushsundar)

దీంతో కుష్బూ షేర్ చేసిన ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో బాలయ్య సరదాగా పోజులు ఇచ్చారు. దీంతో బాలయ్య ఎక్కడున్నా అక్కడ సందడే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. శోభన బాలకృష్ణ, వెంకటేష్ లతో గతంలో కలిసి పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. కుష్బూ మాత్రం వెంకటేష్ మొదటి సినిమాలోనే నటించింది. బాలయ్యతో మాత్రం ఇప్పటికి నటించే ఛాన్స్ రాలేదు.