Chandrababu Naidu : కోమటి, గుప్తా, శెట్టి.. ఈ పేర్లన్నీ క్లోజ్.. ఇక నుంచి ఒకటే.. చంద్రబాబు సంచలన ప్రకటన.. కొత్త పేరు ఇదే..
Chandrababu Naidu :ఏపీ రాజధానిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది.
Statue Of Sacrifice
- అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ
- విగ్రహాన్ని ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’గా నామకరణం
- విగ్రహ నిర్మాణంలో కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు
Chandrababu Naidu : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహంకోసం కృషి చేసిన ప్రతిఒక్కరికి ఈ సందర్భంగా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ రాజధానిలోని శాఖమూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేశ్ తోపాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఆర్యవైశ్య సంఘం పెద్దలు పాల్గొన్నారు.
Also Read : Tamil Nadu Politics : తమిళనాడులో ఎన్డీయే కూటమిలోకి టీవీకే..? క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్..
విగ్రహావిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. అహింసా మార్గంలో పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని చంద్రబాబు గుర్తు చేశారు. ఆయన త్యాగం ఈ తరం వాళ్లు తెలుసుకోవాలని అన్నారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా 58 అడుగుల ఆయన భారీ విగ్రహం ఏర్పాటు చేశామని, ఆరు నెలల్లో మొదటి దశ పనులు పూర్తి చేయడం జరిగిందని, ఈ విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ వినియోగించారని సీఎం చంద్రబాబు చెప్పారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్ గా నామకరణం చేశామని అన్నారు.
స్ఫూర్తికి మారుపేరు ఆర్యవైశ్య సంఘమని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. కోమటి, గుప్తా, శెట్టి పేర్లన్నీ ఒకటేనని.. వీటన్నింటి స్థానంలో అందరినీ ఒకేలా ఆర్యవైశ్య అని పిలిచేలా జీవో తెస్తామని చంద్రబాబు ప్రకటించారు.
