Nalgonda District : ఆడుకునేందుకు కారెక్కిన ఐదేళ్ల చిన్నారి.. ఊహించని ఘటనతో.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి..
Nalgonda District : నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందుఉన్న కారులో ఆడుకునేందుకు ఎక్కిన ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది.
Car Door lock
● నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి విషాదం
● ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారి
● డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక మృతి
Nalgonda District : నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందుఉన్న కారులో ఐదేళ్ల చిన్నారి ఆడుకునేందుకు ఎక్కింది. కారు డోర్లు లాక్ కావడంతో చిన్నారి ఊపిరాడక స్పృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటీన చిన్నారిని కామినేని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో వైద్యులు చిన్నారిని పరీక్షగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు.
నార్కట్‌పల్లికి చెందిన పేర్ని సతీష్; గాయత్రిల కుమార్తె పేర్ని శరణ్య (5) మంగళవారం ఉదయం తన ఇంటి వద్ద ఉన్న చిన్నారులతో కలిసి ఆడుకుటుంది. ఈ క్రమంలో శరణ్య తన ఇంటి ఎదుట నిలిపిఉంచిన కారులోకి వెళ్లింది. ఆ తరువాత డోర్ లాక్ కావడంతో చిన్నారి కారులోని చిక్కుకుపోయింది. కొద్దిసేపటికి పాప కనిపించక పోవడంతో ఆమె తల్లి, కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో అంతా వెతికారు. పాప ఆచూకీ లభిచకపోవటంతో భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నతం తరువాత కారు వద్ద చిన్నారి చెప్పులు ఉండటాన్ని కారు యాజమాని గుర్తించాడు. కారు వద్దకు వెళ్లి చూడగా చిన్నారి కారులో స్పృహతప్పి పడిపోయి ఉంది.
కారులో వెనుక సీటులో అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని హుటాహుటీన నార్కట్ పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి అప్పటికే ఆమె మృతిచెందినట్లు గుర్తించారు. చిన్నారి తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
