AP Government : ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ అదిరిపోయే గిఫ్ట్.. త్వరలో వారి బ్యాంక్ ఖాతాల్లోకి రూ.20వేలు..
AP Government : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. త్వరలో అర్హులైన మత్స్యకార కుటుంబాలకు రూ.20వేల చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనుంది.
AP Government
- ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
- ‘మత్స్యకార భరోసా’ పథకం అమలుకు చర్యలు
- అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి త్వరలో రూ.20వేలు
AP Government : ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అన్నివర్గాల ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కూడా కూటమి సర్కార్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అర్హత కలిగిన ప్రతి మత్స్యకార కుటుంబానికి ప్రతీయేటా రూ.20వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది.
Also Read : Oil Prices Hike : వారం రోజుల్లో చమురు ధరలు భారీగా పెరుగుతాయ్.. కారణాలివే.. అమెరికా ఇంధన శాఖ మంత్రి హెచ్చరిక
రాష్ట్రంలోని మత్స్యకార కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మత్స్యకార భరోసా పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. సముద్రంపైనే ఆధారపడి జీవించే వేలాది మంది మత్స్యకారుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏటా చేపల వేట నిషేధ సమయంలో వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గతంలో ఉన్న సహాయాన్ని పెంచుతూ ప్రతి అర్హత కలిగిన మత్స్యకార కుటుంబానికి రూ.20వేలు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
సముద్ర సంపదను పరిరక్షించడానికి, చేపల పునరుత్పత్తి ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ప్రతి ఏడాది వేసవిలో 61రోజుల పాటు సముద్రంలో చేపట వేటను ప్రభుత్వం నిషేధించింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది. ఈ 61 రోజుల కాలంలో మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బందికాకుండా ప్రభుత్వం అర్హులైన మత్స్యకార కుటుంబానిలకు రూ.20వేల చొప్పున అందజేస్తుంది.
2026 సంవత్సరానికి సంబంధించి ఇవాళ్టి నుంచి జూన్ 14వ తేదీ వరకు సముద్రంలో చేపల వేటపై నిషేధం అమల్లో ఉంటుంది. దీంతో మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం త్వరలో రూ.20వేలు జమ చేయనుంది. ప్రస్తుతం తీర ప్రాంత గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. అనంతరం మత్స్యశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో దరఖాస్తులను పరిశీలించి, అర్హులను గుర్తిస్తారు. ఎంపికైన వారి జాబితాను అందరికీ తెలిసేలా సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. తుది జాబితా ఖరారైన తరువాత ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన మత్స్యకారులు మత్స్యకార గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, బోటుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ పత్రాలను సిద్ధం చేసుకోవాలి. 18 నుంచి 60ఏళ్ల వయస్సువారు ఈ పథకానికి అర్హుల. మత్స్యశాఖలో నమోదైన యాంత్రీకరణ, మోటరైజ్డ్ లేదా సంప్రదాయ పడవల్లో పనిచేసే కార్మికులు మరియు ఆ పడవ యజమానులు అందరూ ఈ పథకానికి అర్హులు. గత ఏడాది దాదాపు 1.30లక్షల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసింది.
