Gold Silver Rate Today : వరుసగా రెండోరోజు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణాలు ఇవే.. ఏపీ, తెలంగాణలో తులం గోల్డ్ ఎంతంటే?
Gold Silver Rate Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. వరుసగా రెండోరోజు ధరలు తగ్గాయి.

Gold Silver Rate Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. వరుసగా రెండో రోజు గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా తగ్గాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు చట్లబడటం, అమెరికా డాలర్ విలువతో పాటు అక్కడ బాండ్ రాబడులు పెరుగుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. చైనా పారిశ్రామిక, తయారీ రంగాలు నెమ్మదించడం వల్ల గిరాకీ తగ్గుతుందనే భావనతో వెండి ధర మరింత క్షీణిస్తోంది.

బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,70 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ.250 తగ్గింది. రెండు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారంపై సుమారు. 3500 తగ్గింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 30డాలర్లకు పైగా తగ్గింది. దీంతో ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 4,085 డాలర్ల వద్దకు చేరింది.

వెండి ధర కూడా భారీగా తగ్గింది. మంగళవారం కిలో వెండిపై రూ.5వేలు తగ్గగా.. ఇవాళ (బుధవారం) కిలో వెండిపై రూ. 10వేలు తగ్గింది. దీంతో రెండు రోజుల్లోనే కిలో వెండిపై రూ. 15వేలు తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,430 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,32,300 వద్దకు చేరింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,480 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,32,450 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,45,640కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,33,500 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,40,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,40,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
