AP Inter 1st 2nd Year Results 2026 : ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. ఏ జిల్లా ఫస్ట్.. ఏ జిల్లా లాస్ట్ అంటే.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ
AP Inter 1st 2nd Year Results 2026 : ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా బుధవారం ఉదయం 10.31గంటలకు ఫలితాలను విడుదల చేశారు.
AP Inter Results 2026
AP Inter 1st 2nd Year Results 2026 : ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా బుధవారం ఉదయం 10.31గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో బాలికలే పైచేయి సాధించారు.
ఫలితాలను పరిశీలిస్తే.. మొదటి సంవత్సరంలో : 77శాతం
ద్వితీయ సంవత్సరంలో : 81శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ప్రథమ సంవత్సరంలో మొత్తం 4,71,864 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 3,61,526 మంది విద్యార్హులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 72 శాతం, బాలికలు 81శాతం ఉత్తీర్ణత సాధించారు.
ద్వితీయ సంవత్సరంలో 4,46,537 మంది విద్యార్థులు హాజరు కాగా.. 3,59,816 మంది విద్యార్హులు ఉత్తీర్ణత సాధించారు. బాలురు 76శాతం, బాలికలు 85శాతం ఉత్తీర్ణత సాధించారు.
జిల్లాల విషయానికొస్తే..
ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాల్లో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. చివరి స్థానంలో అన్నమయ్య జిల్లా నిలిచింది.
ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 90శాతంతో.. ద్వితీయ సంవత్సరంలో 92శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
ప్రథమ సంవత్సరం ఫలితాల్లో చివరి స్థానంలో అన్నమయ్య జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో ఉత్తీర్ణత 62శాతం మాత్రమే.
ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అన్నమయ్య జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 67శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.


