Ugadi 2026 19 or 20 : తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ ఎప్పుడు జరుపుకోవాలి మార్చి 19 లేదా 20నా.. ఇదిగో క్లారిటీ
Ugadi 2026 19 or 20 : ఈ సంవత్సరం ఉగాది పండగ ఎప్పుడు జరుపుకోవాలి.. మార్చి 19న లేదా 20 వ తేదీనా అనే దానిపై క్లారిటీ
which day people celebrate ugadi festival in 2026 on march 19 or 20 here is clarity
Ugadi 2026 19 or 20 : ఈమధ్య కాలంలో హిందువుల పండగలు జరుపుకునే విషయంలో అనేక సందేహాలు తెర మీదకు వస్తున్నాయి. క్యాలెండర్ లో పండగ తేదీ ఒక రోజు ఉంటుంది. కానీ ఆరోజు జరుపుకోవాలా లేదా అనే దానిపై పెద్ద గందరగోళం తలెత్తుతుంది. ఇందుకు ప్రధాన కారణం తిథుల్లో మార్పు. సాధారణంగా హిందువుల పండగలన్నీ చాంద్రమాసం ప్రకారం జరుపుకుంటారు. అలానే ఏ పండుగకు అయినా సరే సూర్యోదయం వేళకు ఉన్న తిథిని అనుసరించి జరుపుకోవానలి శాస్త్రం చెబుతోంది. ఈ క్రమంలోనే ఈసారి ఈసారి ఉగాది మార్చి 19న, 20న అన్న సందేహం తెర మీదకు వచ్చింది.
దీనికి కారణం ఏంటంటే.. మార్చి 19న తెల్లవారుజామునాటికి అమవాస్య గడియలు కొనసాగుతున్నాయి. అయితే మార్చి 19, గురువారం 6.52 నిముషాలకు పాడ్యమి తిథి ప్రారంభం అవుతుంది. ఉదయం తిథుల ప్రకారమే పండగలు జరుపుకోవాలి కనుక.. మార్చి 19, గురువారం నాడే ఉగాది పండగ చేసుకోవలని పండితులు చెబుతున్నారు. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మార్చి 19న నాడే ఉగాది సెలవు ఇచ్చాయి. మార్చి 19న మొదలైన పాడ్యమి తిథి మార్చి 20న తెల్లవారుజామున 4:52 గంటలకు ముగుస్తుంది. అందువల్ల 20వ తేదీన పండుగ జరుపుకోలేము.
