Oscar 2026: కోటా శ్రీనివాసరావుకు ఆస్కార్ నివాళి.. ధర్మేంద్ర సహా మరికొందరికి కూడా.. ఫుల్ లిస్ట్
98వ ఆస్కార్ వేడుకల సందర్భంగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(Oscar 2026) తమ వెబ్సైట్లో ఒక ప్రత్యేక నివాళిని ఏర్పాటు చేసింది.
Special Tributes to Indian Actors on the Oscar Stage
Oscar 2026: ప్రపంచ సినిమా వేదికపై భారతీయ వెండితెర దిగ్గజాలకు అరుదైన గౌరవం దక్కింది. 98వ ఆస్కార్ వేడుకల సందర్భంగా అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తమ వెబ్సైట్లో ఒక ప్రత్యేక నివాళిని ఏర్పాటు చేసింది. 2025 -2026 ఆస్కార్(Oscar 2026) వేడుకల మధ్య కాలంలో కన్నుమూసిన అంతర్జాతీయ సినీ ప్రముఖులను స్మరించుకుంటూ “2025 మరియు 2026 ఆస్కార్ల మధ్య మనం కోల్పోయిన కళాకారులు, చలనచిత్ర నిర్మాతలను స్మరించుకోవడానికి ఒక్క క్షణం కేటాయించండి” అనే సందేశంతో వారి ఫోటోలను పొందుపరిచింది. ఈ జాబితాలో భారతదేశం నుండి నలుగురు దిగ్గజ కళాకారుల ఫోటోలు ఉండటం విశేషం.
Sravanthi Chokkarapu: చీరలో స్రవంతి అందం.. సొగసులు చూస్తే మతిపోవడం ఖాయం.. ఫొటోలు
తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు కోటా శ్రీనివాసరావు, బాలీవుడ్ ‘హీ-మ్యాన్’ ధర్మేంద్ర, దేశభక్తి చిత్రాల స్పెషలిస్ట్ మనోజ్ కుమార్, దక్షిణాది వెండితెర దేవత సరోజా దేవిలకు అకాడమీ ఈ నివాళి అర్పించింది. దశాబ్దాల కాలం పాటు భారతీయ సినిమా అభివృద్ధికి వీరు చేసిన కృషిని ఆస్కార్ గుర్తించడం గమనార్హం. కోటా శ్రీనివాసరావు తన విలక్షణ నటనతో దక్షిణ భారత చిత్రసీమలో చెరగని ముద్ర వేయగా, ధర్మేంద్ర మరియు మనోజ్ కుమార్ లు భారతీయ చలనచిత్ర రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. ఇక సరోజా దేవి తన అందం, అభినయంతో అప్పట్లో సంచలనం సృష్టించారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన సినీ వేదికపై మన దేశానికి చెందిన నటుల ఫోటోలు కనిపించడం భారతీయ సినీ ప్రేమికులకు గర్వకారణంగా మారింది. ఈ గుర్తింపు వారి ప్రతిభకు మరియు భారతీయ సినిమాకు లభించిన అంతర్జాతీయ గౌరవంగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
