Best Smartphones 2022 : 2022లో అత్యంత సరసమైన 4 బెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు మీకోసం.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!

Best Smartphones 2022 : భారత మార్కెట్లో 2022లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. అందులో ఎక్కువగా పాపులర్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు మాత్రేమ కాదు.. మరెన్నో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు కూడా రిలీజ్ అయ్యాయి.

Best Smartphones 2022 : భారత మార్కెట్లో 2022లో అనేక బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. అందులో ఎక్కువగా పాపులర్ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లు మాత్రేమ కాదు.. మరెన్నో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు కూడా రిలీజ్ అయ్యాయి. 2022లో శాంసంగ్ (Samsung), ఆపిల్ (Apple) కంపెనీల నుంచి ఎన్నో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేశాయి. షావోమీ (Xiaomi), OnePlus, iQOO వంటి మరిన్ని బ్రాండ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాదిలో మల్టీ బ్రాండ్‌ల నుంచి సరసమైన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లు భారత మార్కెట్లో రిలీజ్ అయ్యాయి.

అందులో ఎక్కువగా రూ. 50వేల నుంచి రూ. 60వేల ధర పరిధిలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫోన్లలో కొన్ని ఫీచర్లు టాప్-ఆఫ్-ది-లైన్ హార్డ్‌వేర్‌తో వచ్చాయి. భారత మార్కెట్లో రూ. 60వేల లోపు సరసమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. 2022లో రిలీజ్ అయిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లలో ఎంపిక చేసిన టాప్ 4 సరసమైన ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లిస్టును మీకోసం అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ కొనేసుకోండి. అవేంటో ఓసారి లుక్కేయండి..

గూగుల్ పిక్సెల్ 7 (Google Pixel 7) సిరీస్ :
ప్రీమియం ఫోన్ల కోసం చూస్తున్నారా? (Google Pixel 7) బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఒకటి.. గత 4 ఏళ్లలో ఈ ఏడాదిలోనే ఈ ఫోన్‌లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. గూగుల్ Pixel 7 టెన్సర్ G2 చిప్‌తో వచ్చింది. పిక్సెల్ 6 మాదిరి డిజైన్‌ను కలిగి ఉంది. ఫీచర్ల విషయంలో Pixel 7 క్లీన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తుంది.

Best Smartphones 2022 _ Affordable flagship phones that ruled this year

Pixel 7 సిరీస్ ఈ ఏడాదిలో కెమెరా గేమ్‌ను అందిస్తోంది. ఫోన్ వీడియో రికార్డింగ్ బాగుంది. అద్భుతమైన కెమెరాలతో పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌తో Pixel 7 ఫోన్ వచ్చింది. Google Pixel 7 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఏకైక (8GB RAM + 128GB) స్టోరేజ్ వేరియంట్‌తో రూ. 59,999 ధరకు అందుబాటులో ఉంది.

వన్‌ప్లస్ (OnePlus 10T) సిరీస్ :
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం (OnePlus 10T 5G) వన్‌ప్లస్ 10ప్రో స్కేల్-డౌన్ వెర్షన్‌తో వచ్చింది. OnePlus స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. వెంటనే 10T 5Gని సొంతం చేసుకోవచ్చు. వాస్తవానికి, OnePlus 10T Hasselblad బ్రాండింగ్‌ను తొలగించింది. ఫోటోలు, వీడియోలను తీయాలంటే దాదాపుగా OnePlus 10 ప్రోతో సమానంగా ఉంటుంది. వన్‌ప్లస్ 10T స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌ని కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 కన్నా వేగంగా కూల్ రన్ అవుతుంది. వన్‌ప్లస్10ప్రోలో దాదాపు రెండింతలు ఛార్జింగ్ స్పీడ్‌లను (OnePlus 10Tలో 150W) అందిస్తోంది.

Best Smartphones 2022 _ Affordable flagship phones that ruled this year

Read Also : Cheapest 5G Smartphones : భారత్‌లో అత్యంత చౌకైన ధరకే 5G స్మార్ట్‌ఫోన్లు.. మీకు నచ్చిన బడ్జెట్ ఫోన్ కొనేసుకోండి..!

మొత్తం మీద OnePlus 10 Pro గొప్ప స్మార్ట్‌ఫోన్ అని చెప్పవచ్చు. భారత్‌లో OnePlus 10T ధర బేస్ 8GB + 128GB స్టోరేజ్ ఆప్షన్ రూ.49,999 నుంచి ప్రారంభం అవుతుంది. హై స్టోరేజ్ కావాలంటే మిడ్-వేరియంట్‌కి వెళ్లవచ్చు. 12GB RAM, 256GB స్టోరేజ్‌తో వచ్చే దీని ధర రూ. 54,999గా ఉంది. అయితే, మీరు 12GB వేరియంట్‌ కావాలంటే.. 16GB RAM వేరియంట్‌ను రూ.55,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

షావోమీ (Xiaomi 12 Pro) సిరీస్ :
షావోమీ (Xiaomi 12 Pro) అనేది అద్భుతమైన ఆల్‌రౌండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ అని చెప్పవచ్చు. షావోమీ కూడా హై-ఎండ్ క్వాలిటీ డివైజ్‌లను అందిస్తోంది. Xiaomi 12 Pro ఫోన్ AMOLED ప్యానెల్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. ఇతర ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లలో రెండు స్పీకర్లు కన్నా నాలుగు స్పీకర్‌లను యాడ్ చేసింది. అదనంగా, Xiaomi 12 Pro అందమైన ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. మల్టీపుల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. హుడ్ కింద Snapdragon 8 Gen 1 చిప్‌సెట్ కలిగి ఉంది.

Best Smartphones 2022_ Affordable flagship phones that ruled this year

అదనంగా, Xiaomi 12 ప్రో ఫోన్.. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కలిగి ఉంది. OnePlus 10T కన్నా చాలా వేగంగా ఉంటుంది. Xiaomi 12 Pro ప్రస్తుతం 8GB RAM వేరియంట్ ధర రూ.55,999 ఉంటుంది. 12GB RAM వేరియంట్ ధర రూ.59,999గా ఉంటుంది. కార్డ్ ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు పొందవచ్చు. రెండు RAM వేరియంట్‌లలో స్టోరేజీ 256GB వద్ద మార్కెట్లో అందుబాటులో ఉంది.

ఐక్యూ (iQOO 9T) సిరీస్ :
ఐక్యూ ఫోన్లలో (iQOO 9T) అనేది హై-ఎండ్ ఆఫర్.. ఇది స్టైలిష్‌గా కనిపిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్‌తో వస్తుంది. మెస్మరైజింగ్ 120Hz AMOLED డిస్‌ప్లే, పవర్‌ఫుల్ స్టీరియో స్పీకర్లు, 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. 4,700mAh బ్యాటరీతో పాటు ప్రీమియం-లుకింగ్ మెటల్, గ్లాస్ వంటి ఇతర ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. iQOO 9T ఫోన్ సరసమైన ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో అందుబాటులో ఉంది.

Best Smartphones 2022 _ Affordable flagship phones that ruled this year

అదనంగా, 9T Funtouch OSని రన్ అవుతుంది. iQOO 9T కూడా ప్రత్యేకమైన V1+ చిప్‌ను కలిగి ఉంది. అద్భుతమైన కెమెరాతో వచ్చింది. తక్కువ కాంతిలోనూ మెరుగైన గేమింగ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. iQOO 9T ప్రస్తుతం రెండు వేరియంట్‌లలో (8GB RAM + 128GB స్టోరేజీ) ధర రూ. 49,999, 12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 54,999గా భారత మార్కెట్లో అందుబాటులో ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Best in 2022 Smartphones : 2022లో రిలీజ్ అయిన 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన స్మార్ట్‌ఫోన్ కొనేసుకోండి..!

ట్రెండింగ్ వార్తలు