OnePlus Nord 4 Leak : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫొటోలు లీక్..!

OnePlus Nord 4 Leak : ఈ మిడ్-రేంజ్ ఫోన్ జూలై 16న భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ కీలక వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. 

OnePlus Nord 4 Leak : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త ఫోన్ రాబోతోంది. ఈ మిడ్-రేంజ్ ఫోన్ జూలై 16న భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానుంది. లాంచ్ ఈవెంట్‌కు ముందు, వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ సంబంధించి కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

Read Also : WhatsApp Green Verification : వాట్సాప్ గ్రీన్ వెరిఫికేషన్.. ఇకపై బ్లూలోకి మారుతుందోచ్.. యూజర్లకు బెనిఫిట్ ఏంటి?

డిజైన్ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు, వన్‌ప్లస్ నార్డ్ 4 అధికారికంగా కనిపించే ఫొటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ బ్యాక్ డ్యూయల్ టోన్ ఎండ్‌తో వస్తుంది. నోర్డ్ గ్లాస్-మెటల్ బాడీని కలిగి ఉందని లీక్‌లు సూచించాయి.

ఈ లుక్ కొన్ని ఏళ్ల క్రితం గూగుల్ విక్రయించిన క్లాసిక్ పిక్సెల్ ఫోన్‌లను గుర్తు చేస్తుంది. బ్యాక్ ప్యానెల్ డిజైన్ ఒకే విధమైన డిజైన్‌ను కలిగిన పిక్సెల్ 2, పిక్సెల్ 3 సిరీస్‌లను అందిస్తుంది. పైభాగంలో కెమెరా సెటప్, లైట్ కలర్లలో డ్యూయల్-టోన్ ఎండ్ అందిస్తుంది.

వన్‌ప్లస్ నార్డ్ 4 ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
వన్‌ప్లస్ నార్డ్ 4 లీకైన ఫొటో గ్రే కలర్, బ్లాక్, గ్రీన్ అనే కలర్ ఆప్షన్లలో చూపిస్తుంది. గ్రే మోడల్ కూడా బ్యాక్‌ సహా ఒక మోడల్ కలిగి ఉంది. ఈ ఫోన్ స్పష్టంగా ఎడ్జ్‌లతో బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వాల్యూమ్ స్టేటస్ ఎడ్జెస్ట్ చేయొచ్చు. బ్యాక్ రెండు కెమెరాలు కూడా ఉన్నాయి.

వన్‌‌ప్లస్ నార్డ్ 4 బ్యాక్ కెమెరా సెటప్‌లో 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ ఐఎమ్ఎక్స్355 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా ఉంటాయని లీక్‌లు సూచించాయి. ఫ్రంట్ సైడ్ వీడియో కాల్‌లు, సెల్ఫీలకు 16ఎంపీ శాంసంగ్ ఎస్5కె3పీ9 సెన్సార్‌ను చూడవచ్చు. వన్‌ప్లస్ నార్డ్ 4 6.74-అంగుళాల ఓఎల్ఈడీ టైన్మా యూ8+ డిస్‌ప్లేతో వస్తుందని పేర్కొన్నారు. ఈ ప్యానెల్ 1.5కె రిజల్యూషన్, 120Hzరిఫ్రెష్ రేట్, 2150నిట్స్ గరిష్టంగా సపోర్టు అందిస్తుంది.

ఫోన్ లీక్‌ల ప్రకారం.. హుడ్ కింద, క్వాల్‌కామ్ స్నాప్‌‌డ్రాగన్ 7 ప్లస్ జనరేషన్ 3 చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 100డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 14 ఓఎస్ రన్ అవుతుంది. కంపెనీ యూజర్లకు 3 ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందజేస్తుంది.

Read Also : iPhone 14 Plus Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌‌‌పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ట్రెండింగ్ వార్తలు