iPhone 14 Plus Price : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్‌‌‌పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

iPhone 14 Plus Price : ఈ ఆఫర్ జూలై 5 నుంచి జూలై 6, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ 29 శాతం మేర ధర తగ్గింపును అందిస్తోంది.

iPhone 14 Plus Price : మీరు కొత్త ఐఫోన్‌ కొనుగోలు చేసేందుకు చూస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్‌‌లో ఐఫోన్ 14 ప్లస్‌పై భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 ప్లస్ 1284×2778 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉంది. 1200 నిట్స్ వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సూర్యకాంతిలో కూడా స్పష్టమైన వ్యూను అందిస్తుంది. ఈ డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : TRAI CNAP Service : ఇక ట్రూ కాలర్‌తో పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్.. ఈ నెల 15 నుంచే సర్వీసులు..!

ఐఫోన్ 14 ప్లస్‌పై తగ్గింపు :
128జీబీ స్టోరేజ్‌తో ఆపిల్ ఐఫోన్ 14 ప్లస్ వాస్తవానికి రూ.79,900 వద్ద లాంచ్ అయింది. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ 29 శాతం మేర ధర తగ్గింపును అందిస్తోంది. ఇప్పుడు, ధర రూ.55,999కి తగ్గింది. అదనంగా, ఇతర బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. ధరను మరింత తగ్గిస్తాయి. మీకు హెచ్‌ఎస్‌బీసీ క్రెడిట్ కార్డ్ ఉంటే.. ఫ్లాట్ రూ. 4,500 తగ్గింపు పొందవచ్చు.

కానీ, ఈ ఆఫర్ జూలై 5 నుంచి జూలై 6, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉంటే.. ఈఎంఐ ఆప్షన్లకు మాత్రమే రూ. 5వేల వరకు తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్ జూలై నెల మొత్తం చెల్లుబాటు అవుతుంది.

మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. పైగా, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ధరను మరింత తగ్గించవచ్చు. ఉదాహరణకు, ఐఫోన్ 13 పూర్తిగా రూ. 26వేల తగ్గింపును పొందవచ్చు. చివరి ధర రూ. 30వేల కన్నా తక్కువగా ఉంటుంది. ఈ తగ్గింపులతో కొత్త మోడల్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్ స్పెషిఫికేషన్లు :
ఐఫోన్ 14 ప్లస్ 1284×2778 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పెద్ద 6.7-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ ఐఫోన్ 1200 నిట్స్ వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. సూర్యకాంతిలో కూడా స్పష్టమైన వ్యూను అందిస్తుంది. డిస్‌ప్లే సిరామిక్ షీల్డ్ గ్లాస్ ద్వారా కూడా ప్రొటెక్షన్ అందిస్తుంది. ఆపిల్ A15 బయోనిక్ చిప్‌తో ఆధారితమైన ఈ ఫోన్ వేగవంతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 6జీబీ ర్యామ్ కలిగి ఉంది. 128జీబీ నుంచి 512జీబీ వరకు స్టోరేజీ ఆప్షన్లతో వస్తుంది. మీ అన్ని యాప్‌లు, ఫోటోలు, వీడియోలకు తగినంత స్టోరేజీని అందిస్తుంది.

ఐఫోన్ 14 ప్లస్ రెండు 12ఎంపీ సెన్సార్‌లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. స్టాండర్డ్, అల్ట్రా-వైడ్ అందిస్తుంది. అదనంగా, 12ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌లకు సరైనది. బ్యాటరీ విషయానికొస్తే.. ఈ ఫోన్ 4352mAh బ్యాటరీతో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. దుమ్ము, నీటి నిరోధకతను అందిస్తుంది. రోజువారీ ఉపయోగానికి బెస్ట్ ఆప్షన్‌ అని చెప్పవచ్చు.

2024లో కొనుగోలు చేయడం విలువైనదేనా? :
ఆపిల్ ఐఫోన్ 16 అతి త్వరలో రానుంది. ఐఫోన్ 14 కొనడం మంచిదా కాదా అనేది ఇప్పడు తెలుసుకుందాం. ఐఫోన్ 14 ప్లస్, లేటెస్ట్ మోడల్ కానప్పటికీ, ఇప్పటికీ ఆకట్టుకునే స్పెషిఫికేషన్లు, పర్ఫార్మెన్స్ అందిస్తుంది. కొత్త ఐఫోన్‌లు చిన్న అప్‌గ్రేడ్‌లను అందించినప్పటికీ, ఐఫోన్ 14 ప్లస్ బలమైన పోటీదారుగా చెప్పవచ్చు. ప్రత్యేకించి తగ్గింపు ధరను అందిస్తుంది. మీరు పొందే ఫీచర్‌లు, పనితీరుకు బెస్ట్ అని చెప్పవచ్చు.

ఐఫోన్ 14 ప్లస్ సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే.. ఆపిల్ డివైజ్‌లకు సాధారణ ఐఓఎస్ అప్‌డేట్స్ ఎక్స్‌టెండెడ్ సపోర్టు అందిస్తుంది. మీ ఫోన్‌ను లేటెస్టుగా సేఫ్‌గా ఉంచుతుంది. సరికొత్త టెక్నాలజీ కన్నా పెద్ద స్క్రీన్, సరసమైన ధరకు ప్రాధాన్యత ఇస్తే.. ఐఫోన్ 14 ప్లస్ అనేది అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

Read Also : WhatsApp Green Verification : వాట్సాప్ గ్రీన్ వెరిఫికేషన్.. ఇకపై బ్లూలోకి మారుతుందోచ్.. యూజర్లకు బెనిఫిట్ ఏంటి?

ట్రెండింగ్ వార్తలు