Apple iPhone 16 Plus : కొంటే ఐఫోన్ కొనాలి బ్రో.. ఈ ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్‌పై ఏకంగా రూ. 21,500 డిస్కౌంట్, ఎలాగంటే?
Apple iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఐఫోన్ 16 ప్లస్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. మీ బడ్జెట్ ధరలోనే కొత్త ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే ఐఫోన్ 16 ప్లస్ కొనడం బెటర్.
Apple iPhone 16 Plus
- భారత్‌లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరకు లాంచ్
- విజయ్ సేల్స్‌లో ఈ ఐఫోన్ 16 ప్లస్ రూ.71,890కి తగ్గింపు
- HDFC క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 3,500 అదనపు డిస్కౌంట్
- ఐఫోన్ 16 ప్లస్ కొనుగోలుపై ధర రూ.18,010 ఫ్లాట్ డిస్కౌంట్
Apple iPhone 16 Plus : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఐఫోన్ 16 ప్లస్ అతి చౌకైన ధరకే లభిస్తోంది. మీ బడ్జెట్ ధరలోనే కొత్త ఐఫోన్ సొంతం చేసుకోవచ్చు. మీ పాత ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని చూస్తుంటే ఐఫోన్ 16 ప్లస్ కొనడం బెటర్.
ప్రస్తుతం విజయ్ సేల్స్ ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.21,500 కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. సాధారణంగా ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు కొనాలని అనుకుంటే మాత్రం వెంటనే కొనేసుకోవడం బెటర్. ఈ ఐఫోన్ 16 ప్లస్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ రూ. 89,900 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. విజయ్ సేల్స్ అధికారిక వెబ్సైట్లో ఈ ఐఫోన్ ప్రస్తుతం రూ. 71,890కి జాబితా లిస్ట్ అయింది. రూ. 18,010 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై అదనంగా రూ. 3,500 డిస్కౌంట్ పొందవచ్చు.
ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ A18 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లకు సపోర్టు ఇస్తుంది. ఫొటోగ్రఫీ కోసం ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48MP మెయిన్ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా కూడా ఉంది.
ఆపిల్ ఐఫోన్ 16 ప్లస్ 6.7-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తుంది. ఐఫోన్ 16 ప్లస్ సింగిల్ ఛార్జ్‌పై 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ అందిస్తుంది.
