TRAI CNAP Service : ఇక ట్రూ కాలర్‌తో పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్.. ఈ నెల 15 నుంచే సర్వీసులు..!

TRAI CNAP Service : ట్రూకాలర్ వంటి అప్లికేషన్లపై ఆధారపడాల్సిన పనిలేకుండా మొబైల్ యూజర్లు తమకు వచ్చిన ఫోన్ కాలర్స్ పేర్లను తెలుసుకోవచ్చు.

TRAI CNAP Service : ప్రముఖ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)కొత్త రూల్ తీసుకొస్తోంది. ఇకపై, థర్డ్ పార్టీ సర్వీసులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. జూలై 15 (సోమవారం), 2024 నుంచి కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP)సర్వీస్‌ను యాక్టివేట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ట్రూకాలర్ వంటి అప్లికేషన్లపై ఆధారపడాల్సిన పనిలేకుండా మొబైల్ యూజర్లు తమకు వచ్చిన ఫోన్ కాలర్స్ పేర్లను తెలుసుకోవచ్చు. ఈ కొత్త విధానం ద్వారా థర్డ్ పార్టీ అప్లికేషన్ల అవసరాన్ని తగ్గించడమే కాకుండా పారదర్శకత, వినియోగదారుల సౌకర్యాన్ని మరింత మెరుగుపరచడమే ట్రాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇకపై ఫోన్ చేసింది ఎవరు అనేది గుర్తించడానికి ట్రూకాలర్ వంటి అప్లికేషన్లను ఇన్ స్టాల్ చేయనక్కర్లేదు. గతంలో, వినియోగదారులు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్‌లను గుర్తించడానికి (TrueCaller) వంటి యాప్‌లపై ఆధారపడేవారు. అయినప్పటికీ, కంటి ఒత్తిడికి సంబంధించి ఆందోళనలు తలెత్తాయి.

ఫోన్ కాల్ వివరాలు, కాంటాక్టులతో సహా ఫోన్ డేటాకు అలాంటి యాప్‌ల యాక్సెస్ అవసరం పడుతుంది. అప్పుడే ఆయా సర్వీసులు యాక్టివేట్ అవుతాయి. లేదంటే మీ ఫోన్ కాల్ చేసింది ఎవరు అనేది గుర్తించడం కష్టమే. కానీ, ఇకపై ఆందోళన అక్కర్లేదని ట్రాయ్ చెబుతోంది.

ట్రాయ్ కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP)సర్వీసు ఇన్‌కమింగ్ కాల్ సమయంలో నేరుగా ఫోన్ స్క్రీన్‌పై కాలర్ సమాచారాన్ని ప్రదర్శిస్తుంది. తద్వారా ఫోన్ కాలర్ ఐడెంటిటీ సమస్యలను పరిష్కరిస్తుంది. అంతేకాదు.. అదనపు అప్లికేషన్‌ల అవసరాన్ని కూడా తొలగిస్తుంది. వినియోగదారులకు వారి డేటాపై ఎక్కువ నియంత్రణ కూడా ఉంటుంది.

కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ (CNAP)సర్వీసు ముఖ్య అంశాలివే :
• ఎవరైనా కాల్ చేసినప్పుడు CNAP కాలర్ పేరును ఫోన్ స్క్రీన్‌లపై ప్రదర్శిస్తుంది.
• సబ్ స్ర్కైబర్లు అందించిన డేటాను యాక్సస్ చేయొచ్చు.

1997లో స్థాపించిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI)టెలికమ్యూనికేషన్ సేవలను నియంత్రించడంతో పాటు సర్వీస్ ప్రొవైడర్లు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం, భారత్ టెలికం రంగంలో వృద్ధిని ప్రోత్సహించడం తప్పనిసరి చేసింది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే ట్రాయ్ అథారిటీ ప్రాధాన్యతగా చెప్పవచ్చు.

ట్రాయ్ నివేదికల ప్రకారం.. భారత్ ప్రస్తుతం ప్రపంచంలోని రెండవ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ మార్కెట్ టైటిల్‌ను కలిగి ఉంది. సెప్టెంబర్ 30, 2022 నాటికి, దేశం 114.55 కోట్ల వైర్‌లెస్ సబ్ స్క్రైబర్లు కలిగి ఉండగా, 2.65 కోట్ల వైర్‌లైన్ సబ్ స్క్రైబర్లు కలిగి ఉంది. గత రెండు దశాబ్దాలుగా భారత టెలికమ్యూనికేషన్ రంగంలో విశేషమైన వృద్ధిని సాధించింది.

Read Also : Truecaller Fraud insurance : ట్రూకాలర్ యూజర్ల కోసం ఫ్రాడ్ ఇన్సూరెన్స్ ఫీచర్.. ఇదేలా పనిచేస్తుందంటే?

ట్రెండింగ్ వార్తలు