WhatsApp Green Verification : వాట్సాప్ గ్రీన్ వెరిఫికేషన్.. ఇకపై బ్లూలోకి మారుతుందోచ్.. యూజర్లకు బెనిఫిట్ ఏంటి?

WhatsApp Green Verification : వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తోంది. వెరిఫైడ్ బిజిసెస్ కోసం గ్రీన్ చెక్‌మార్క్‌ను బ్లూ కలర్‌తో రీప్లేస్ చేస్తుంది.

WhatsApp Green Verification : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ భారత్ అంతటా మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. వివిధ వ్యాపారాలకు అనేక మంది కస్టమర్‌లతో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ద్వారా ఇంటరాక్ట్ అవుతుంటారు.

Read Also : Vivo Y28s 5G Launch : భారత్‌కు వివో Y28s 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!

మెక్‌డొనాల్డ్స్ వంటి ఫుడ్ బిజినెస్‌ల నుంచి అనేక వ్యాపారాలకు కూడా వినియోగదారులు వాట్సాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు, ఈ బిజినెస్ అకౌంట్లలో పేరు పక్కన గ్రీన్ చెక్‌మార్క్ ద్వారా గుర్తించవచ్చు. కానీ, త్వరలో ఈ ఫీచర్ మారుతుంది.

వాట్సాప్ కొత్త అప్‌డేట్‌ను విడుదల చేస్తోందని కొత్త నివేదిక పేర్కొంది. వెరిఫైడ్ బిజిసెస్ కోసం గ్రీన్ చెక్‌మార్క్‌ను బ్లూ కలర్‌తో రీప్లేస్ చేస్తుంది. ధృవీకరించిన ఛానెల్‌లు అప్‌డేట్ చెక్‌మార్క్‌ను కూడా పొందుతాయి.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లోని బ్లూ చెక్‌మార్క్‌ల మాదిరిగానే అన్ని మెటా ప్లాట్‌ఫారమ్‌లలో వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను స్టేబుల్‌గా ఉండేలా చేయడం ఈ అప్‌డేట్ లక్ష్యం అని నివేదిక తెలిపింది. వాట్సాప్ ప్రస్తుతం ఈ మార్పును పబ్లిక్‌గా పరీక్షిస్తోంది. కొంతమంది బీటా యూజర్లు ఇప్పుడు కొత్త బ్లూ చెక్‌మార్క్‌ను చూడగలరు.

వాట్సాప్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. కొత్త బ్లూ చెక్‌మార్క్ ఓల్డ్ గ్రీన్ బ్యాడ్జ్‌ను రీప్లేస్ చేస్తుంది. యాప్ రూపాన్ని ఇతర మెటా ప్లాట్‌ఫారమ్‌లతో అందిస్తుంది. ధృవీకరించిన ఛానెల్‌లు లేదా వ్యాపారాలతో యూజర్లకు భరోసా ఇస్తూ బ్లూ కలర్ చెక్‌మార్క్ ఇప్పటికీ అథెంటికేషన్ ఐకాన్ నిలుస్తుంది.

ప్రస్తుతానికి, గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ కోసం సరికొత్త వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది బీటా టెస్టర్లకు బ్లూ చెక్‌మార్క్ ఫీచర్ అందుబాటులో ఉంది. రాబోయే వారాల్లో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్ ఛానెల్‌ల కోసం మరో ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది.

మెసేజింగ్ యాప్ త్వరలో ఛానెల్ యజమానులు వారి వ్యక్తిగత చాట్‌ల నుంచి నేరుగా మెసేజ్‌లు, మీడియాను ఫార్వార్డ్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ ఫీచర్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఛానెల్ ఓనర్‌లకు మీడియా షేరింగ్ సులభం అవుతుంది. ఈ ఫీచర్ ముందుగా అవసరమైన ఛానెల్‌లను నిర్వహించే ప్రక్రియను సులభతరం చేస్తుంది.

Read Also : Lava Blaze X 5G : లావా బ్లేజ్ X 5జీ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. వచ్చేవారమే భారత్‌లో లాంచ్..!

ట్రెండింగ్ వార్తలు