Bajaj Freedom CNG Bike : బజాజ్ ఫ్రీడమ్ 125.. ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. 330కి.మీ రేంజ్.. ధర, ఫీచర్లు, మైలేజ్ ఎంతంటే?

Bajaj Freedom CNG Bike : ఈ కేటగిరీలోని రైడర్‌లకు నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. రూ. 95వేల నుంచి రూ. 1.10 లక్షల మధ్య ధర (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఫ్రీడమ్ 125 బైకు బుకింగ్‌లు జూలై 5 నుంచే ప్రారంభమయ్యాయి.

Bajaj Freedom CNG Bike : కొత్త బైక్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైకును ప్రవేశపెట్టింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో నడిచే ఈ కొత్త బైక్ ప్రపంచంలోనే మొట్టమొదటి మోటార్‌సైకిల్‌గా గుర్తింపు పొందింది. ఈ 125cc కమ్యూటర్ బైక్ పెట్రోల్, సీఎన్‌‌జీ రెండింటిలోనూ పనిచేస్తుంది.

Read Also : OnePlus Nord 4 Leak : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫొటోలు లీక్..!

ఈ కేటగిరీలోని రైడర్‌లకు నిర్వహణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. రూ. 95వేల నుంచి రూ. 1.10 లక్షల మధ్య ధర (ఎక్స్-షోరూమ్) ఉంటుంది. ఫ్రీడమ్ 125 బైకు బుకింగ్‌లు జూలై 5 నుంచే ప్రారంభమయ్యాయి. ప్రణాళికలలో భాగంగా ముందుగా గుజరాత్, మహారాష్ట్రలలో ప్రారంభమై ఆ తర్వాత ఈజిప్ట్, టాంజానియా, పెరూ, ఇండోనేషియా, బంగ్లాదేశ్‌తో సహా మార్కెట్‌లకు ఎగుమతి చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది.

పెట్రోల్, సీఎన్‌జీ ట్యాంకులు.. స్విచ్ మౌంటెడ్ ఆప్షన్ :
ఫ్రీడమ్ 125 ఇతర మోడళ్లతో పోలిస్తే.. ఇంధన ఖర్చులలో 50 శాతం తగ్గింపును పొందవచ్చు. చిన్న పెట్రోల్ ట్యాంక్, సీఎన్‌జీ సిలిండర్‌తో అమర్చిన ఈ మోటార్‌సైకిల్, హ్యాండిల్‌బార్-మౌంటెడ్ స్విచ్‌ని ఉపయోగించి రైడర్‌లను ప్యూయల్ టైప్ మధ్య మారడానికి అనుమతిస్తుంది.

పెట్రోల్ ట్యాంక్ కింద ఉంచిన సీఎన్‌జీ సిలిండర్, బైక్ డిజైన్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఇతర మోడళ్లలో వేరుగా ఉంటుంది. ఈ మోటార్‌సైకిల్‌లో సీఎన్‌జీ పెట్రోల్ స్పెషల్ నాజిల్‌లు ఉన్నాయి. ప్రత్యేక స్టోరేజీ అవసరాలను కూడా తీరుస్తుంది. పెట్రోల్ ట్యాంక్ 2 లీటర్లు, సీఎన్‌జీ ట్యాంక్ 2 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది.

కేవలం సీఎన్‌జీతో 123కి.మీ వేగం :
బజాజ్ ఫ్రీడమ్ 125 కేవలం సీఎన్‌జీతో 213 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. పెట్రోల్ ట్యాంక్ ద్వారా అదనంగా 117 కిలోమీటర్లు మొత్తం 330 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇంధన సామర్థ్యం సీఎన్‌జీకి 102km/kg, పెట్రోల్ 64km/lగా రేటింగ్ పొందింది. ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో కూడిన 125సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో నడిచే ఫ్రీడమ్ 125 9.4బీహెచ్‌పీ, 9.7ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.

ఈ బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, బ్యాక్ మోనోషాక్ ఉన్నాయి, బ్రేకింగ్ ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్ ద్వారా రన్ అవుతుంది. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై రన్ అవుతుంది. ఫ్రీడమ్ 125 డీఆర్ఎల్ కలిగిన రౌండ్ హెడ్‌ల్యాంప్‌తో మోడ్రన్-రెట్రో ఫీచర్ కలిగి ఉంది. బైక్ డిజైన్‌లో ఫ్లాట్ సీట్, వెడల్పాటి హ్యాండిల్ బార్, న్యూట్రల్ రైడింగ్ పొజిషన్ సెంటర్-సెట్ ఫుట్ పెగ్‌లు ఉన్నాయి. సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో-సీఎన్‌జీ అలర్ట్, న్యూట్రల్ గేర్ ఇండికేషన్ వంటి వివిధ ఇండికేషన్లను ప్రదర్శిస్తుంది.

Read Also : OnePlus Nord 4 Leak : వన్‌ప్లస్ నార్డ్ 4 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ఫొటోలు లీక్..!

ట్రెండింగ్ వార్తలు