Ainu Nephrologist
Ainu Nephrologist : నెఫ్రాలజీ, యూరాలజీ సేవలకు పేరొందిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక యూరాలజీ సదస్సు రెండో ఎడిషన్ ప్రారంభమైంది. యూరేత్రా అండ్ ఏఐఎన్‌యూ పేరుతో నిర్వహిస్తున్న ఈ రెండు రోజుల సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 8 8 దేశాల నుంచి అనేక మంది యూరాలిజిస్టులు హాజరయ్యారు.
మూత్రనాళలు సన్నబడే అవకాశం వారిలోనే ఎక్కువ :
అందులో మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 800 మందికి పైగా యూరాలజిస్టులు ఉన్నారు. మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలలో సరికొత్త టెక్నిక్ ఎలా వాడాలి అనేదానిపై చర్చ ఈ సదస్సులో జరుగుతోంది. మూత్రనాళాలు సన్నబడటం వల్ల మూత్రవిసర్జన తగ్గడంతోపాటు అనేక సమస్యలు వచ్చినప్పుడు ఈ శస్త్రచికిత్స చేస్తారు. అయితే, సన్నబడే అవకాశాలు పురుషుల్లోనే ఎక్కువగా ఉన్నప్పటికీ, పిల్లలు, మహిళల్లో కూడా కనిపిస్తుంది.
Read Also : Hyderabad Hospital : హైదరాబాద్ వైద్యుల అరుదైన ఘనత.. 60ఏళ్ల వ్యక్తి కిడ్నీలో 418 రాళ్లను తొలగించారు..!
గతంలో మూత్రనాళాలు సన్నబడటానికి గ్రామీణ ప్రాంతాల్లోని పారిశుధ్య పరిస్థితులే కారణం. గత రెండు దశాబ్దాలుగా అవగాహన పెరిగింది. 30 నుంచి 40శాతం వరకు ఈ సమస్యలు తగ్గాయి. రోడ్డు ప్రమాదాలు, ఇన్ఫెక్షన్లతో మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలను ఎక్కువగా చేయాల్సి వస్తోందని ఏఐఎన్‌యూ ఆస్పత్రి యూరాలజిస్టులు తెలిపారు. ఏఐఎన్‌యూ ఆస్పత్రి యూరాలజిస్టు డాక్టర్ భవతేజ్ ఎన్‌గంటి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ ఫ్రాక్చర్లు జరిగితే మూత్రనాళాలు దెబ్బతింటాయి.
కొన్ని నెలలు తర్వాత సరిచేయాలి. ఇలాంటి ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. ముందు వాహనాన్ని వేగంగా ఢీకొడితే.. ఇతర అవయవాలతో పాటు మూత్రనాళాలు కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఎస్‌టీఐ యూటీఐ లాంటి ఇన్ఫెక్షన్ల కారణంగా మూత్రనాళాలు సన్నబడుతున్నాయి. క్యాన్సర్‌కు రేడియేషన్ సమయంలో కూడా మూత్రనాళాల్లో సమస్యలు వస్తున్నాయి. కొందరు పిల్లల్లో పుట్టుకతోనే మూత్రనాళం ఏర్పడదు. ఆస్పత్రిలో ఉన్న సమయంలో క్యాథటర్స్, అదనపు వ్యాధుల వల్ల ఈ సమస్య వస్తోందన్నారు.
సెల్ థెరపీ ఆధారంగా రీజనరేటివ్ పద్ధతులు :
సాధారణంగా మూత్రనాళాలకు రిపేర్ చేసినప్పుడు అవి ఫెయిలయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ల సొంత టిష్యూల ఆధారంగానే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. బుగ్గలలో టిష్యూ, నాలుక దగ్గర ఉండే టిష్యూలను తీసుకుంటామన్నారు. జెనెటికల్ ఇంజినీర్ లేదా బయో ఇంజినీరింగ్ నైపుణ్యాలు అవసరం. ఎక్కువసార్లు విఫలం అయితే టిష్యూ అందుబాటులో ఉండదని, సెల్ థెరపీ ఆధారంగా రీజనరేటివ్ పద్ధతులను అవలంబిస్తున్నారు. టిష్యూను ఇంజెక్ట్ చేయడం ద్వారా మూత్రనాళం దానంతట అదే మెరుగుపడుతుంది.
Ainu Nephrologist
గడిచిన 9ఏళ్లలో వెయ్యికి పైగా శస్త్రచికిత్సలు చేశామని ఏఐఎన్‌యూ మేనేజింగ్ డైరెక్టర్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున అన్నారు. గతంలో ఏడాదికి 50 శస్త్రచికత్సలే చేసేవాళ్లమన్నారు. ఇప్పుడు 200 నుంచి 250 వరకు శస్త్రచికిత్సలు చేస్తున్నాం.
దక్షిణ భారతదేశంలోనే ఇలాంటి శస్త్రచికిత్సలలో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. నిపుణుల నుంచి అనేక విషయాలు నేర్చుకుని శిక్షణ పొందడమే ఈ సదస్సు ఉద్దేశంగా చెప్పవచ్చు. మూత్రనాళ పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు సంక్లిష్టమైనవి. అంతేకాదు.. వైఫల్యాల రేటు కూడా ఎక్కువేనన్నారు. రోగుల వైపు నుంచి చూసినప్పుడు పెరుగుతున్న డిమాండుకు తగినట్టుగా నిపుణులైన సర్జన్లకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సదస్సులో ఉగాండా, యూకే, నేపాల్, బంగ్లాదేశ్, థాయ్ లాండ్, సింగపూర్, గల్ఫ్ దేశాలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో నుంచి సుమారు 800 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలనే మూత్రనాళ శస్త్రచికిత్సలలో అగ్రగామిగా పేరొందిన డాక్టర్ సంజయ్ కులకర్ణి, డాక్టర్ గణేష్ గోపాలకృష్ణన్ ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐఎస్‌బీ హైదరాబాద్ మాజీ డీన్ అజిత్ రంగ్నేకర్ కూడా పాల్గొన్నారు.
Read Also : టన్నుకు రూ.88 వసూలు.. ఉచితంగా ఇసుకను అందించేందుకు రంగం సిద్ధం, విధివిధానాలు ఇవే