Lava Blaze X 5G : లావా బ్లేజ్ X 5జీ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు అదుర్స్.. వచ్చేవారమే భారత్‌లో లాంచ్..!

Lava Blaze X 5G Launch : రాబోయే లావా స్మార్ట్‌ఫోన్ టీజర్ ప్రకారం.. 64ఎంపీ కెమెరా, 16జీబీ వరకు ర్యామ్‌ను కలిగి ఉంటుందని అంచనా.

Lava Blaze X 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి వచ్చేవారం లావా బ్లేజ్ ఎక్స్ 5G ఫోన్ రాబోతుంది. ఈ మేరకు కంపెనీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ హ్యాండ్‌సెట్‌ను గత నెలలో మొదటిసారిగా టీజ్ చేయగా, స్పెసిఫికేషన్‌లు లేదా లాంచ్ టైమ్‌లైన్‌కు సంబంధించిన వివరాలు ఏవీ వెల్లడించలేదు.

Read Also : Vivo Y03t Launch : వివో నుంచి సరికొత్త Y03t ఫోన్, స్మార్ట్‌‌వాచ్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

రాబోయే లావా స్మార్ట్‌ఫోన్ టీజర్ ప్రకారం.. 64ఎంపీ కెమెరా, 16జీబీ వరకు ర్యామ్‌ను కలిగి ఉంటుందని అంచనా. అమెజాన్‌లో ఈ ఫోన్ లాంచ్ వివరాలకు సంబంధించి మైక్రోసైట్ కూడా క్రియేట్ చేసింది.

లావా బ్లేజ్ ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్‌లు (అంచనా) :
లావా చిన్న టీజర్ వీడియోతో పాటు బ్లేజ్ ఎక్స్ 5జీ లాంచ్ తేదీని షేర్ చేసింది. అంతేకాదు.. కొన్ని ఫోన్ ఫీచర్లను కూడా వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్ జూలై 10న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. లాంచ్ తర్వాత, జూలై 20, జూలై 21 మధ్య జరగనున్న ప్రైమ్ డే సేల్ సమయంలో అమెజాన్‌లో ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

లావా బ్లేజ్ ఎక్స్ 5జీ బ్యాక్ సైడ్ వృత్తాకార కెమెరా మాడ్యూల్, హౌసింగ్ డ్యూయల్ కెమెరాలు, ఎల్ఈడీ ఫ్లాష్‌తో కనిపిస్తుంది. కెమెరా యూనిట్‌లో 64ఎంపీ చెప్పే టెక్స్ట్ కూడా కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రాధమిక సెన్సార్‌ను కూడా సూచిస్తుంది. ఇంకా, టీజర్ 16జీబీ ర్యామ్‌తో రావచ్చునని 8జీబీ ఫిజికల్ ర్యామ్‌తో 8జీబీ ర్యామ్ వర్చువల్‌గా అందించే అవకాశం ఉందని సూచిస్తుంది.

కచ్చితమైన స్పెసిఫికేషన్‌లు అస్పష్టంగా ఉన్నప్పటికీ, హ్యాండ్‌సెట్ ఫ్రంట్ కెమెరా హోల్-పంచ్ కటౌట్‌తో కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. పవర్, వాల్యూమ్ బటన్‌లు స్మార్ట్‌ఫోన్‌కు కుడి వైపున ఉన్నట్లు కనిపిస్తాయి. అయితే, స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రే, యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ దిగువన ఉండవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ఫ్రేమ్‌లో మెటల్ బిల్డ్ ఉన్నట్లు కనిపిస్తుంది.

టీజర్ ఫొటోల ప్రకారం.. గ్రే బ్లాక్, బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉండవచ్చు. లావా బ్లేజ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 5జీ కనెక్టివిటీతో వస్తుంది. లావా బ్లేజ్ ఎక్స్ 5జీ కంపెనీ బ్లేజ్ లైనప్‌లోని బ్లేజ్ కర్వ్ , బ్లేజ్ 2, బ్లేజ్ 2 ప్రో వంటి ఇతర స్మార్ట్‌ఫోన్‌లలో చేరాలని భావిస్తున్నారు .

Read Also : TRAI CNAP Service : ఇక ట్రూ కాలర్‌తో పనిలేదు.. ట్రాయ్ కొత్త రూల్.. ఈ నెల 15 నుంచే సర్వీసులు..!

ట్రెండింగ్ వార్తలు