Moto G85 5G Launch : మోటో జీ85 5జీ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Moto G85 5G Launch : భారత్‌కు రాకముందు, ఈ హ్యాండ్‌సెట్ ఫీచర్లతో మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కనిపించింది. రాబోయే మోటో జీ85 5జీ డిస్‌ప్లే చిప్‌సెట్, బ్యాటరీతో సహా చాలా స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది.

Moto G85 5G Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి మోటోరోలా నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతోంది. మోటో G85 5జీ ఫోన్ వచ్చే వారం (జూలై 10న) భారత మార్కెట్లో లాంచ్ కానుంది. ఈ మేరకు కంపెనీ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ధృవీకరించింది.

మోటోరోలా రెజర్ 50 సిరీస్‌తో పాటు చైనాలో లాంచ్ అయిన మోటోరోలా ఎస్50 నియో రీబ్రాండెడ్ వెర్షన్‌గా గత జూన్ 26న ఈ స్మార్ట్‌ఫోన్ యూరప్‌లో లాంచ్ అయింది. భారత్‌కు రాకముందు, ఈ హ్యాండ్‌సెట్ ఫీచర్లతో మైక్రోసైట్ ఫ్లిప్‌కార్ట్‌లో కనిపించింది. రాబోయే మోటో జీ85 5జీ డిస్‌ప్లే చిప్‌సెట్, బ్యాటరీతో సహా చాలా స్పెసిఫికేషన్‌లను రివీల్ చేసింది.

Read Also : Mobile Recharge Plans : జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా కన్నా చౌకైన ధరకే బీఎస్ఎన్ఎల్ మొబైల్ ప్లాన్లు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

మోటో జీ85 5జీ స్పెసిఫికేషన్స్ :
మోటో జీ85 5జీ 120Hz రిఫ్రెష్ రేట్, 1,600నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల పీఓఎల్ఈడీ స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉందని, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ గామట్ కవరేజీని అందిస్తుందని నివేదిక పేర్కొంది. కొలతల పరంగా, మోటో జీ85 5జీ ఫోన్ బరువు 175గ్రాములు, 7.59ఎమ్ఎమ్ మందం కలిగి ఉంది. కోబాల్ట్ బ్లూ, ఆలివ్ గ్రీన్, అర్బన్ గ్రే అనే మూడు కలర్ ఆప్షన్లలో వేగన్ లెదర్ డిజైన్‌లో అందుబాటులో ఉంటుంది.

స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. గరిష్టంగా 12జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. అదనంగా, 8జీబీ+128జీబీ స్టోరేజీతో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ర్యామ్ బూస్ట్ ఫీచర్‌కు సపోర్టు ఇస్తుంది. ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. రెండు ఏళ్ల హామీ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, మూడు ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందుతాయి.

ఫొటోలు, వీడియోలకు రాబోయే మోటో జీ85 5జీ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50ఎంపీ సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌తో కూడిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), 8ఎంపీ అల్ట్రా-వైడ్ షూటర్ ఉంటాయి. ఫ్రంట్ సైడ్ 32ఎంపీ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. మోటోరోలా ప్రకారం.. స్మార్ట్ కనెక్ట్, ఫ్యామిలీ స్పేస్, మోటో సెక్యూర్ వంటి సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లను అందిస్తుంది. అదనంగా, హ్యాండ్‌సెట్ దుమ్ము, నీటి నిరోధకతకు ఐపీ52 రేటింగ్‌ను కలిగి ఉంటుంది.

కంపెనీ ప్రకారం.. మోటో జీ85 5జీ ఫోన్ 33డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000mAh బ్యాటరీతో వస్తుందని పేర్కొన్నారు. గరిష్టంగా 90 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 38 గంటల టాక్ టైమ్, 22 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. మోటో జీ85 5జీ ఇతర ఫీచర్లలో 13 5జీ బ్యాండ్‌లకు సపోర్టు, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.

Read Also : Vodafone Idea Plans : వోడాఫోన్ ఐడియాలో పెరిగిన ప్రీపెయిడ్, పోస్టుపెయిడ్ కొత్త ప్లాన్ల ధరలివే.. జూలై 4 నుంచి మరింత ప్రియం!

ట్రెండింగ్ వార్తలు