Motorola Razr 50 Ultra : మోటోరోలా మడతబెట్టే ఫోన్ వచ్చిందోచ్.. మల్టీ టాస్కింగ్ ఫీచర్లు అదుర్స్.. భారత్‌లో ధర ఎంతంటే?

Motorola Razr 50 Ultra Launch : ఈ మోటోరోలా రెజర్ 50 అల్ట్రాతో పాటు ఫ్రీ పెయిర్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను కూడా కంపెనీ అందిస్తోంది. భారత్ ధరకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Motorola Razr 50 Ultra Launch : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లోకి కొత్త మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది. ఈ మడతబెట్టే ఫోన్ ధర దాదాపు రూ. 1 లక్ష లోపు ఉంటుంది. ఈ కొత్త వెర్షన్ భారీ డిస్‌ప్లే, అద్భుతమైన డిజైన్, ఐపీ రేటింగ్, కొత్త హార్డ్‌వేర్ వంటి మరిన్ని ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంటుంది.

Read Also : Vivo Y28s 5G Launch : భారత్‌కు వివో Y28s 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్!

కంపెనీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఫ్రీ పెయిర్ వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను కూడా అందిస్తోంది. గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే.. రిటైల్ బాక్స్‌లో ఫోన్‌కు సంబంధించిన కేసు కూడా ఉంటుంది. మీరు ఇతర ఫోల్డబుల్ ఫోన్‌లతో పొందలేరని గమనించాలి. మోటోరోలా రెజర్ 50 అల్ట్రా స్పెషిఫికేషన్లు, భారత్ ధరకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మోటోరోలా రెజర్ 50 అల్ట్రా : భారత్ ధర ఎంతంటే? :
మోటోరోలా రెజర్ 50 అల్ట్రా ఫోన్ 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ.99,999కు అందిస్తోంది. లాంచ్‌లో భాగంగా ఈ ఫోన్ రూ. 5వేల ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్‌తో అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై అదనంగా రూ. 5వేల తగ్గింపు ఆఫర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ధరను రూ.89,999కి తగ్గిస్తుంది. అమెజాన్, రిలయన్స్ స్టోర్లు, ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఫ్లిప్ ఫోన్ జూలై 20 నుంచి అమ్మకానికి వస్తుంది. జూలై 10న ప్రీ-రిజర్వ్‌కు అందుబాటులో ఉంటుంది.

మోటోరోలా రెజర్ 50 అల్ట్రా: స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
మోటోరోలా రెజర్ 50 అల్ట్రా క్వాల్‌కామ్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జనరేషన్ 3 ఎస్ఓసీ ద్వారా పవర్ పొందుతుంది. ముందున్న దానితో పోలిస్తే సన్నని బెజెల్‌లతో పెద్ద కవర్ స్క్రీన్‌తో వస్తుంది. బయటి స్క్రీన్‌పై కంటెంట్ వినియోగం పరంగా మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందించే అవకాశం ఉంది. పీఓఎల్ఈడీ ప్యానెల్ 1080p రిజల్యూషన్, 100 శాతం డీసీఐ-పీ3 కలర్ ఆప్షన్, హెచ్‌డీఆర్10 ప్లస్ సపోర్టు అందిస్తుంది. డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 1Hz-165Hz మధ్య ఎడ్జెస్ట్ అవుతుంది. ఒకరు మాత్రమే వీడియోలను చూడగలరు. నావిగేషన్ వివరాలను చెక్ చేయగలరు. ఏదైనా క్యాప్చర్ చేస్తున్నప్పుడు సెల్ఫీలను చెక్ చేయవచ్చు. ఫ్లిప్ ముడుచుకుంటే బయటి స్క్రీన్‌పై ఇతర టాస్క్ పూర్తి చేయగలదు.

ఫోల్డ్ ఓపెన్ చేసినప్పుడు 6.9-అంగుళాల ఎఫ్ హెచ్‌డీ+ poOLED స్క్రీన్‌తో వస్తుంది. ట్రేడేషనల్ ఫోన్‌లు వినియోగదారులకు అందిస్తున్న దానికన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. లోపలి స్క్రీన్ మెరుగైన 120 శాతం డీసీఐ-పీ3 కలర్ ఆప్షన్లను కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ కవర్ స్క్రీన్ మాదిరిగా ఉంటుంది. లోపలి ప్యానెల్‌లో 360Hz టచ్ శాంపిల్ రేట్, 3000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. ఫ్రంట్ సైడ్ 32ఎంపీ సెన్సార్ కూడా ఉంది.

మోటోరోలా రెజర్ 50 అల్ట్రా కెమెరా పరంగా పెద్ద అప్‌గ్రేడ్‌ను పొందింది. కొత్త వెర్షన్‌లో 50ఎంపీ ఎఫ్/1.7 ప్రైమరీ కెమెరా, 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50ఎంపీ ఎఫ్/2.0 టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. కెమెరాలో కొన్ని ముఖ్య ఏఐ ఫీచర్లు 30ఎక్స్ ఏఐ సూపర్ జూమ్, ఏఐ యాక్షన్ షాట్, ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ ట్రాకింగ్ వంటివి ఉన్నాయి. హుడ్ కింద, 4,000mAh బ్యాటరీ కూడా ఉంది.

మునుపటి వెర్షన్‌లో చూసిన 3,800mAh బ్యాటరీ కన్నా కొంచెం పెద్దది. వేగవంతమైన 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌కు సపోర్టు అందిస్తుంది. మోటోరోలా రెజర్ 40 అల్ట్రా మోడల్‌లో 30డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్ కన్నా ఎక్కువని చెప్పవచ్చు. మోటోరోలా 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్ ఐపీఎక్స్8 నీటి-నిరోధకతను కలిగి ఉంది. పాత వెర్షన్ అందించడం లేదు.

Read Also : Oppo Reno 12 Series : కొత్త ఒప్పో రెనో 12 సిరీస్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 12నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?

ట్రెండింగ్ వార్తలు