ITR Filing Made Easy : ఐటీఆర్ ఫైలింగ్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ తెలుసా? ఇ-ఫైలింగ్ కోసం ఏయే డాక్యుమెంట్లు అవసరమంటే?

ITR Filing Made Easy : ప్రస్తుతం ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియను ఇన్‌కమ్ ట్యాక్స్ సులభతరం చేసింది. పన్ను చెల్లించేవారు తమ ఐటీఆర్ ఫారంలను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించవచ్చు.

ITR Filing Made Easy : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు సమయం ఆసన్నమైంది. జూలై 31, 2024లోగా పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయాలి. పన్ను చెల్లింపుదారులకు ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 1 – మార్చి 31) ఆదాయాన్ని నివేదించడానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడం అనేది చాలా కీలకమైన ప్రక్రియ.

Read Also : ITR Filing Process : మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? పాత ఆదాయపు పన్ను విధానం ఎలా ఎంచుకోవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

గత ఏడాదితో పోల్చితే.. ప్రస్తుతం ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియను ఇన్‌కమ్ ట్యాక్స్ సులభతరం చేసింది. పన్ను చెల్లించేవారు తమ ఐటీఆర్ ఫారంలను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించవచ్చు. ఇందుకోసం ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్ సందర్శించవచ్చు. ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన ఆదాయం మించినట్టయితే తప్పనిసరిగా రిటర్న్స్ దాఖలు చేయాలి. ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాలను పొందవచ్చు.

ఐటీఆర్ ఫైలింగ్‌కు అవసరమైన డాక్యుమెంట్లు :
పాన్, ఆధార్ కార్డులు: ఐటీఆర్ ఫైల్ చేసేందుకు తప్పనిసరి.
బ్యాంక్ అకౌంట్ వివరాలు : మీ బ్యాంక్ అకౌంట్ సమాచారం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలి.
టీడీఎస్ సర్టిఫికేట్‌లు (ఫారమ్‌లు 16, 16A, 26AS) : ఈ ఫారమ్‌లతో పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయొచ్చు.
పన్ను చెల్లింపు చలాన్‌లు (వర్తిస్తే) : ఏదైనా పన్ను చలాన్‌ల రికార్డులను ఉంచుకోండి.
పన్ను తగ్గింపుకు ఇన్వెస్ట్ ప్రూఫ్ (సెక్షన్లు 80C, 80D): పన్ను ఆదా చేసే పెట్టుబడులకు డాక్యుమెంట్లు తప్పనిసరి.

వేతనం ద్వారా పొందే ఆదాయం :
ఫారమ్ 16 : ఎంప్లాయిర్ అందించిన ఫారమ్.. మీ వేతనం ద్వారా ఆదాయం, పన్ను మినహాయింపులను వివరిస్తుంది.
నెలవారీ జీతం స్లిప్‌లు : మీ నెలవారీ జీతం స్లిప్‌లను రిఫరెన్స్ కోసం దగ్గర ఉంచుకోండి.
పన్ను విధించే అలవెన్సులు, మినహాయింపులు : ఇంటి అద్దె భత్యం (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) వంటి క్లెయిమ్ చేసిన మినహాయింపుల వివరాలను ట్రాక్ చేయండి.

ఇతర వనరుల నుంచి ఆదాయం:
బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, వడ్డీ సర్టిఫికెట్‌లు : సేవింగ్స్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు మొదలైన వాటి నుంచి సంపాదించిన వడ్డీ రికార్డులు. అకౌంట్ నంబర్లు, IFSC కోడ్‌లు, బ్యాంక్ పేర్లను చేర్చండి.
డివిడెండ్ వారెంట్లు : రూ. 10 లక్షల వరకు పన్ను రహిత డివిడెండ్‌లను ట్రాక్ చేయండి. అదనపు 10శాతం పన్ను విధింపు
ఫారమ్ 26AS : ట్యాక్స్ స్టేట్‌మెంట్‌లో వివిధ వనరుల నుంచి TDS ఉంటుంది.
పెరిగిన వడ్డీ : నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు (NSC), ఇలాంటి స్కీమ్స్ నుంచి వచ్చే వడ్డీ ఆదాయానికి అకౌంట్ ఉండాలి.
లాటరీల్లో గెలిస్తే : 30శాతం పన్ను విధింపుతో లాటరీ ద్వారా ఆదాయాన్ని రిపోర్టు చేయాలి.
వ్యవసాయ ఆదాయం : వ్యవసాయ ఆదాయానికి సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, రసీదులను చూపించాలి.
కుటుంబ ఆదాయం : పన్ను నిబంధనల ప్రకారం.. ఒక కుటుంబంలో ఆధారపడిన వారి ఆదాయ వివరాలను కూడా చేర్చాలి.

హౌస్ ప్రాపర్టీ నుంచి ఆదాయం :
రెంట్ అగ్రిమెంట్ : మీ ఆస్తి నుంచి నెలవారీగా పొందే అద్దె వివరాలను పొందుపర్చండి.
బ్యాంక్ నుంచి వడ్డీ సర్టిఫికేట్ : హోమ్ లోన్ వడ్డీ తగ్గింపులను క్లెయిమ్ కోసం అవసరం. ఆ సర్టిఫికేట్ అసలు, వడ్డీ చెల్లింపులు కనిపించేలా ఉండాలి.
ప్రాపర్టీ అడ్రస్ : ఆస్తి సంబంధిత పన్ను తగ్గింపుల కోసం క్లెయిమ్ చేయాలంటే ఇది అవసరం.
సహ-యజమాని వివరాలు (వర్తిస్తే) : పన్ను తగ్గింపు క్లెయిమ్‌ల కోసం సహ-యజమానుల వివరాలను కూడా ఇవ్వండి.
చెల్లించిన మున్సిపల్ పన్నుల రసీదులు : పరిశీలన ప్రయోజనాల కోసం వీటిని దగ్గర ఉంచుకోండి.
అద్దెపై ఫారమ్ 16A (వర్తిస్తే) : ఈ ఫారమ్ చెల్లించిన అద్దెపై పన్నుల మినహాయింపు కోసం రికార్డులు ఉండాలి.
నిర్మాణానికి ముందు వడ్డీ వివరాలు : ఐదు వాయిదాలలో క్లెయిమ్ చేయవచ్చు. కచ్చితమైన పన్ను గణనకు వివరాలను చేర్చండి.
ఓనర్ ప్రూఫ్ : హోమ్ లోన్ వడ్డీ మినహాయింపును క్లెయిమ్ చేసేందుకు ఇది అవసరం.
హోమ్ లోన్ ఛార్జీలు : ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 24(B) కింద మినహాయింపు ఉంటుంది.

పన్ను ఆదా చేసే పెట్టుబడులు, తగ్గింపులు :
సెక్షన్ 80C : ఈ సెక్షన్ ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS), ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), పన్ను ఆదా చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS), సుకన్య సమృద్ధిలో పెట్టుబడులకు తగ్గింపులను పొందవచ్చు. ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలతో పాటు సంబంధిత డాక్యుమెంట్లను కూడా దగ్గర ఉంచుకోండి.
సెక్షన్ 80G డొనేషన్లు : డోనర్ పేరు, పాన్, అడ్రస్ సహా స్వచ్ఛంద సంస్థలకు చేసిన విరాళాల రసీదులను దగ్గర ఉంచండి.
సెక్షన్ 80E ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ : విద్యా రుణాలపై వడ్డీ చెల్లింపులకు బ్యాంక్ నుంచి రసీదులను పొందండి. 8 ఏళ్ల వరకు మినహాయింపు పొందవచ్చు.
సెక్షన్ 80D మెడి-క్లెయిమ్ ఇన్సూరెన్స్: సెల్ఫ్, ఫ్యామిలీ మెంబర్ల కోసం చెల్లించిన మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల రసీదులను అలాగే ఉంచుకోండి.
ఇతర పెట్టుబడులు : పన్ను తగ్గింపు కోసం సంవత్సరంలో చేసిన అన్ని ఇతర పెట్టుబడులకు సంబంధించిన రసీదులను భద్రపరుచుకోండి.

అదనపు ఖర్చులపై మినహాయింపు.. :
ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్స్ : ప్రావిడెంట్ ఫండ్స్‌ వంటి రికార్డులను నోట్ చేసుకోండి.
పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజు : ట్యూషన్ ఫీజు చెల్లింపుల రసీదులు దగ్గర పెట్టుకోండి.
జీవిత బీమా ప్రీమియంలు : జీవిత బీమా పాలసీలపై ప్రీమియం చెల్లింపుల రసీదులను భద్రపరుచుకోండి.
స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు : స్టాంప్ డ్యూటీ, ఆస్తిపై చెల్లించిన రిజిస్ట్రేషన్ ఛార్జీల రసీదులు ఉంచుకోండి.
హోమ్ లోన్‌పై ప్రిన్సిపల్ రీపేమెంట్ : మీ హోమ్ లోన్‌పై చేసిన చెల్లింపుల వివరాలను దగ్గర పెట్టుకోండి.
ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్/మ్యూచువల్ ఫండ్స్ : ELSS లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో చేసిన పెట్టుబడుల రికార్డులు ఉండాలి.

Note : సెక్షన్ 80C కింద గరిష్టంగా రూ. 1.5 లక్షలు మినహాయింపు పొందవచ్చు.

Read Also : Motorola Razr 50 Ultra : మోటోరోలా మడతబెట్టే ఫోన్ వచ్చిందోచ్.. మల్టీ టాస్కింగ్ ఫీచర్లు అదుర్స్.. భారత్‌లో ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు