Amazon Black Friday Sale : అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్.. గూగుల్ పిక్సెల్ 10ప్రోపై కిర్రాక్ డిస్కౌంట్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు!
Amazon Black Friday Sale : గూగుల్ పిక్సెల్ 10 ప్రో డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Amazon Black Friday Sale
Amazon Black Friday Sale : కొత్త గూగుల్ పిక్సెల్ 10 భారీగా తగ్గిందోచ్.. ప్రస్తుతం అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. ప్రతి సేల్ మాదిరిగానే ఈసారి కూడా అమెజాన్ పలు బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఖతర్నాక్ డీల్స్ అందిస్తోంది. మీరు కూడా ఈ హ్యాండ్‌సెట్‌ను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయం.
గూగుల్ పిక్సెల్ 10 ప్రోపై అద్భుతమైన ఆఫర్ (Amazon Black Friday Sale) అందుబాటులో ఉంది. ఈ పిక్సెల్ 10 ప్రో ధరను రూ. 12,200 కన్నా ఎక్కువ తగ్గింపు అందిస్తోంది. ముఖ్యంగా కొత్తగా లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. మీరు పిక్సెల్ 10 ప్రోని కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో పిక్సెల్ 10 ప్రో ఫోన్ ధర రూ.1,09,999కు లాంచ్ అయింది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా పిక్సెల్ 10 ప్రోపై రూ.8,499 ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. తద్వారా ధర రూ.1,01,500కు తగ్గింది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.3,750 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్ ట్రేడ్ చేయవచ్చు.
గూగుల్ పిక్సెల్ 10 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల ఎల్టీపీఓ, ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. అలాగే, స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 కవర్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. హుడ్ కింద, పిక్సెల్ 10 ప్రో టెన్సర్ G5 చిప్‌సెట్, టైటాన్ M2 చిప్‌తో అమర్చి ఉంటుంది. వీటితో పాటు 16GB ర్యామ్, 256GB స్టోరేజ్ ఉన్నాయి.
ఈ గూగుల్ పిక్సెల్ ఫోన్ 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,870mAh బ్యాటరీని కలిగి ఉంది. కెమెరాల విషయానికొస్తే.. గూగుల్ పిక్సెల్ 10 ప్రో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో 50MP వైడ్-యాంగిల్ లెన్స్, 48MP అల్ట్రా-వైడ్ లెన్స్, 48MP 5x టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 42MP కెమెరా కలిగి ఉంది.
